కార్మికుల సమ్మెకు మోడి పరిష్కారం: విభజించు-పాలించు

కార్మికుడిని “శ్రమ యోగి” గా ప్రధాని నరేంద్ర మోడి అభివర్ణించారు. కార్మికులను ఆకాశానికి ఎత్తుతూ ‘శ్రమయేవ జయతే” అని నినాదం ఇచ్చారు. ఆయన అభివర్ణన, నినాదం కేవలం అలంకార ప్రాయమే అని కార్మికులకు తెలియడానికి నెల రోజులు కూడా పట్టలేదు. గత అరవై యేళ్లుగా భారత దేశ ప్రజల ఇంధనం అవసరాలను కోల్ ఇండియా కంపెనీ తీరుస్తోంది. అలాంటి కంపెనీలో వాటాలను మోడి ప్రభుత్వం ప్రైవేటు బహుళజాతి కంపెనీలకు అమ్మేయడానికి నిరసనగా కార్మికులు సమ్మె బాట పట్టారు.…

మోడి హయాం: జాత్యహంకార ఇజ్రాయెల్ తో వాణిజ్య వృద్ధి

భారత ప్రభుత్వం పగ్గాలను ఎన్.డి.ఏ నేత నరేంద్ర మోడి చేపట్టిననాటి నుండి జాత్యహంకార ఇజ్రాయెల్ తో మన వాణిజ్యం కొత్త పుంతలు తొక్కుతోంది. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగానే ఇజ్రాయెల్ తో సన్నిహిత సంబంధాలు పెంచుకుని వాణిజ్య స్నేహాలను ఏర్పాటు చేసుకున్నా నరేంద్ర మోడి, ప్రధాన మంత్రి పీఠం అధిష్టించాక తన పలుకుబడిని మరింతగా విస్తరించారు. ఫలితంగా ఇజ్రాయెల్-ఇండియాల మధ్య త్వరలోనే స్వేచ్చా వాణిజ్య ఒప్పందం కుదరవచ్చని వాణిజ్య విశ్లేషకులు, అంతర్జాతీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. నిజానికి కాంగ్రెస్…

నెహ్రూ వారసత్వానికి కాంగ్రెస్ తాళం -కార్టూన్

కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు మోడి ఇమేజి దెయ్యమై వేధిస్తోంది. కళ్ళు తెరిచినా, మూసినా మోడి భూతమే ప్రత్యక్షం అవుతుండడంతో తనను బంధించుకునే పరిస్ధితిలో పడిపోయింది. తాను ఎప్పుడూ గొప్పగా చెప్పుకునే స్వాతంత్ర పోరాట వారసత్వాన్ని మోడి ఎక్కడ తన్నుకుపోతారో అన్న భయంతో ప్రధమ ప్రధాని నెహ్రూ ఇమేజికి తాళం వేసేసుకుంది. నవంబర్ 14, నెహ్రూ జన్మదినం. ఎప్పుడూ వచ్చే జన్మదినం కాదు 125వ జన్మదినం. అది పురస్కరించుకుని నెహ్రూ సంస్మరణ సభలు, సెమీనార్లు ఏర్పాటు చేసిన కాంగ్రెస్…

జి20: మోడియే ప్రధాన ఆకర్షణ!

ఆస్ట్రేలియా నగరం బ్రిస్బేన్ లో జరుగుతున్న జి20 సమావేశాల్లో భారత ప్రధాని నరేంద్ర మోడి గారే ప్రధాన ఆకర్షణగా నిలిచారని పత్రికలు కోడై కూస్తున్నాయి. భారత పత్రికలే కాకుండా కొన్ని పశ్చిమ పత్రికలు కూడా ఈ అంశంలో ఏకాభిప్రాయాన్ని కలిగి ఉండడం విశేషం. ముఖ్యంగా పశ్చిమ రాజ్యాధినేతలు మోడితో కరచాలనం చేయడానికి, వీలయితే హగ్ చేసుకోవడానికీ, ఆయనతో కలిసి ఫోటోలు దిగడానికి ఆసక్తి చూపుతున్నారట. నవంబర్ 15, 16 తేదీలలో బ్రిస్బేన్ లో జి20 గ్రూపు దేశాల…

మోడి సమక్షంలో కాశ్మీర్ లేని భారతం!

జి20 గ్రూపు దేశాల సమావేశాల నిమిత్తం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోడి సమక్షంలో భారత దేశ పటం చిన్నబోయింది. ఆస్ట్రేలియాలో అడుగు పెట్టిన వెంటనే క్వీన్స్ లాండ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ (క్యూ.యు.టి) ని ప్రధాని మోడి సందర్శించగా యూనివర్సిటీ వారు కాశ్మీరు లేని భారత దేశాన్ని మోడి సందర్శనలో ప్రదర్శించారు. ఇదే వ్యవహారం యు.పి.ఏ ఏలుబడిలో జరిగితే హిందూత్వ సంస్ధల గగ్గోలు ఏ స్ధాయిలో ఉండేదో గానీ ఈసారి మాత్రం కిక్కురు మనలేదు.…

మోడి రెండు ముఖాలు -కరణ్ ధాపర్

(సి.ఎన్.ఎన్-ఐ.బి.ఎన్ చానెల్ లో ‘డెవిల్స్ అడ్వొకేట్’ కార్యక్రమం నిర్వాకులు గానూ, హెడ్ లైన్స్ టుడే న్యూస్ ఛానెల్ లో ‘టు ద పాయింట్’ కార్యక్రమం సంధానకర్తగానూ జర్నలిస్టు కరణ్ ధాపర్ సుప్రసిద్ధులు. ఆర్.ఎస్.ఎస్ నేతృత్వంలోని సంఘ్ పరివార్ సంస్ధలు బోధించే అశాస్త్రీయ నమ్మకాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ఏకంగా ఒక అత్యాధునిక పరిశోధనా ఆసుపత్రి ప్రారంభంలో వ్యక్తం చేయడాన్ని విమర్శిస్తూ ఆయన ది హిందు పత్రికకు రాసిన వ్యాసానికి ఇది యధాతధ అనువాదం. -విశేఖర్) *****************…

బి.జె.పి అచ్ఛే దిన్ కింది వరకూ చేరేనా! -కార్టూన్

“బి.జె.పి వాళ్ళ అచ్ఛే దిన్, బొట్టు బొట్టుగా మన వరకూ కారుతాయా, లేదా?” ********** మోడి/బి.జె.పి ప్రభుత్వం హానీ మూన్ రోజులు గడిచిపోయాయి. వారే పెట్టుకున్న వంద రోజుల గడువు కూడా పూర్తయింది. కానీ వారు అట్టహాసంగా ప్రకటించిన అభివృద్ధి, ఉద్యోగాలు మాత్రం ఇంతవరకూ లేశామాత్రమైనా పత్తా లేవు. పల్లెల్లో కూలీ/రైతు ఇల్లాలికి ‘ట్రికిల్ డౌన్ సిద్ధాంతం‘ తెలుసని కాదు. కానీ బొట్లు బొట్లుగా రాలి పడడం అంటే ఏమిటో వారికి తెలుసు. గొప్పోళ్లకు లభిస్తున్న ‘మంచి…

మోడి, అమిత్ జైత్రయాత్ర -కార్టూన్ కవిత

ఏయే శక్తులు చేతులు కలిపెనో… ఏయే సామ్రాజ్యాలు ఆశీర్వదించేనో… ఏయే వర్గాలు వైరుధ్యముల బాపెనో… ఏయే రాజకీయ వైరులు వెన్నుజూపెనో… ఏయే కంపెనీలు నిధులను పరిచెనో… ఏయే (హిందూ) దేవతలు ఓటు వర్షముల కురిపించెనో… ఏయే ముజఫర్ నగర్ లు ఆత్మహనన ఓట్లు గుమ్మరించెనో… ఏయే కుల సమీకరణలు తిరుగబడెనో… ఏయే పేలుళ్లు రక్త తిలకం దిద్దెనో… ఏయే మిత్రులు శత్రు నాటకంబాడెనో… ఏయే శత్రులు సలాము చేసెనో… నేర చట్టముల పదును విరిగెను! న్యాయ స్ధానములు…

ప్రయోజనాల సమతూకం -ది హిందు ఎడిట్

(మోడి ఇటీవల ప్రకటించిన కార్మిక వ్యతిరేక కార్మిక సంస్కరణలకు ది హిందు మద్దతుగా వస్తూ ఈ సంపాదకీయం వెలువరించింది. నిస్పక్షపాత ముద్రను కాపాడుకోవడానికి ఈ సంపాదకీయంలో పత్రిక చాలా ప్రయాసపడింది. అనునయ మాటలతో, నచ్చజెప్పే ధోరణితో పాఠకుల చేత చేదు మాత్రను మింగించడానికి కృషి చేసింది. తనిఖీల లోపం వల్ల కార్మికులకు నష్టం కలుగుతుందని నామమాత్రంగా చెబుతూ అంతిమంగా భారత దేశ శ్రామిక ప్రజల హక్కులకు భంగం కలిగించే కార్మిక సంస్కరణలను నిండు మనసుతో పత్రిక ఆహ్వానించడం…

మంచిరోజుల్లో మరో రోజు: కట్లు తెంచుకున్న డీజెల్

  ప్రధాని మోడి హామీ ఒసంగిన మంచి రోజుల్లో మరో శుభ దినం రానే వచ్చెను. డీజెల్ ధరల్ని మార్కెటింగ్ కంపెనీల దయాదాక్షిణ్యాలకు వదిలివేస్తూ డీ-రెగ్యులేషన్ కు మోడి ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే సందర్భం వచ్చినప్పుడల్లా కాంగ్రెస్ ను పడదిడుతూ కూడా, అదే కాంగ్రెస్ ఏలికలు నియమించిన రంగరాజన్ కమిటీ ఫార్ములాయే ఆదర్శంగా దేశీయ గ్యాస్ రేట్లను ఎం.ఎం.బి.టి.యు ఒక్కింటికి 4.2 డాలర్ల నుండి 5.61 డాలర్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రంగరాజన్ కమిటీ సిఫారసు ప్రకారం…

నల్లడబ్బు వివరాలన్నీ చెప్పలేరట!

నల్ల డబ్బు కధ మరో చుట్టు తిరిగొచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం నల్లడబ్బు వివరాలను దాచి ఉంచడానికి ఏయే కతలు చెప్పారో సరిగ్గా అవే కధల్ని మన అవినీతి వ్యతిరేక ఛాంపియన్ అయిన నరేంద్ర మోడీగారి ప్రభుత్వం వినిపిస్తోంది. దేశం దాటి పోయి అనేక రహస్య స్విస్ ఖాతాల బంకర్లలో శత్రు దుర్భేద్యమై నక్కిన నల్లడబ్బుని మెడపట్టి లాక్కొచ్చి జనానికి అప్పజెపుతామని వీరాలాపాలు పలికిన మోడి గారి ప్రభుత్వం కాంగ్రెస్ చెప్పిన మాటల్నే చిలక పలుకుల్లా వల్లిస్తోంది. ఎన్.డి.ఏ…

పాక్ ఉల్లంఘనల మధ్య మోడి బిజీ -కార్టూన్

ఇక్కడ రాష్ట్రాల ఎన్నికలను చూసుకోవడమా, అక్కడ సరిహద్దులో పాకిస్ధాన్ కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనలను పట్టించుకొనడమా? ‘కిం కర్తవ్యం’ అన్న సంకట కాలాన్ని ప్రధాని నరేంద్ర మోడి ఎదుర్కొంటున్నారని కార్టూన్ సూచిస్తోంది. ఎన్నికల వేళ కావడంతో ప్రతిపక్ష పార్టీ నేత రాహుల్ గాంధీ సైతం పాక్ ఉల్లంఘనలను తమ పార్టీ ప్రయోజనాలకు అనువుగా ఉపయోగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక పక్క పాకిస్ధాన్ కాల్పుల్లో ప్రజలు, సైనికులు ప్రాణాలు కోల్పోతుంటే “అంతా సవ్యంగానే ఉంటుంది” అని ప్రధాని ప్రకటనలు…

మోడి: చీపురే ఓట్ల మంత్రదండంగా… -కార్టూన్

ఎన్నికల నేపధ్యంలో ప్రధాని నరేంద్ర మోడి ప్రారంభించిన ‘స్వచ్ఛ్ భారత్ అభియాన్’ బి.జె.పికి అచ్చివస్తుందని ఆ పార్టీ ఆశలు పెట్టుకుంది. చీపురు చేతబట్టి ఢిల్లీ వీధులను శుభ్రం చేస్తున్న ప్రధాని మోడి ఫోటోలు ఇప్పుడు భారత దేశంలో ఒక ప్రాచుర్య దృశ్యం. ఈ దృశ్య ప్రాచుర్యాన్ని సొమ్ము చేసుకునేందుకు మోడి నడుం బిగించారని కార్టూన్ సూచిస్తోంది. లేదంటే ప్రభుత్వంలోకి వచ్చి నాలుగు నెలలు గడిచాయో లేదో అప్పుడే కూటమి పాలనా రోజులకు కాలం చెల్లిందని మోడి ప్రకటించగలరా?…

చీపురు వెనక సందేశం -ది హిందూ ఎడిట్

(ఆం ఆద్మీ చేతిలోని చీపురు కాస్తా ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడి చేతిలోకి వచ్చేసింది. స్వయంగా చీపురు చేతబట్టి ఒక సెంట్రల్ ఢిల్లీలో ఒక పోలీసు స్టేషన్ ఆవరణను శుభ్రం చేయడం ద్వారా ప్రధాని దేశం దృష్టిని గొప్పగా ఆకర్షించారు. కానీ ఇలాంటి కార్యక్రమాలు ఒక రోజు ఆర్భాటంతో ముగియడం భారత దేశానికి అనుభవమే. చంద్రబాబు నాయుడు గారి ‘ప్రజల వద్దకు పాలన’ అధికారులను జనం వద్దకు తేవడం తప్ప సాధించిందేమీ లేదు. వై.ఎస్.ఆర్ ప్రవేశపెట్టిన అనేక…

మోడీకి సమన్లు ఇస్తే $10 వేల బహుమతి

పట్టిస్తే పదివేలు! ఈ పేరుతో పాత తెలుగు సినిమా ఒకటి ఉందనుకుంటా. అమెరికాకు అధికార పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడికి న్యూయార్క్ ఫెడరల్ కోర్టు జారీ చేసిన సమన్లు అందించేందుకు అక్కడి మానవ హక్కుల సంస్ధ సరిగ్గా ఇలాంటి మార్గాన్నే ఎంచుకుంది. కోర్టు సమన్లను నరేంద్ర మోడీకి అందజేసినవారికి 10,000 డాలర్లు బహుమతిగా ఇస్తామని ఎ.జె.సి తరపు లాయర్ గుర్పత్వంత్ సింగ్ పన్నున్ ప్రకటించారు. భారత దేశంలో నక్సలైట్ నాయకులను పట్టుకోవడానికి వారి తలలకు…