ఇదీ మోడీ వ్యవసాయ మద్దతు! -కార్టూన్
“నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించడం” అనే సామెత వింటుంటాం. భారత రైతుల పట్ల ప్రధాని మోడి వ్యవహరిస్తున్న తీరు అలాగే ఉంది. “వేలాది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాటిని ఆపలేమా?” అని ఆయన బహిరంగ సభల్లో ప్రశ్నిస్తారు. ఆత్మహత్యలు ఆపండి మహా ప్రభో అని ఆయనని అందలం ఎక్కిస్తే, ఆ అందలం మీద కూర్చొని ఆత్మహత్యల్ని ఆపలేమా అని తిరిగి జనాన్ని ప్రశ్నించడం ఏమిటి, జనాన్ని వెక్కిరించడం కాకపోతే! నిన్నో మొన్నో ఆయన బ్యాంకర్ల సమావేశంలో మాట్లాడారు.…

