‘రాజకీయం’ అను యోగాసనం -కార్టూన్

చూడ్డానికి సామాన్యంగా కనిపిస్తున్న ఈ కార్టూన్ లో లోతైన అర్ధం దాగి ఉంది. ప్రధాన మంత్రి పదవి లాంటి ముళ్ళ కుర్చీని యోగాసనాల సహాయంతో నరేంద్ర మోడి అవలీలగా నిర్వహిస్తున్నారని ఈ కార్టూన్ చెబుతున్నట్లు మొదటి చూపులో అనిపిస్తుంది. కానీ ‘డెవిల్ ఇన్ ద డీటైల్స్’ అన్నట్లుగా కార్టూన్ అంతరార్ధం అంతా ఆ నాలుగు పదాల కార్టూన్ వ్యాఖ్యానంలో దాగి ఉంది. ఆ నాలుగు పదాల వ్యాఖ్య: THE YOGA OF POLITICS: ఏమిటి ఈ వ్యాఖ్య…

రాజే: అసెంబ్లీ క్లీన్ చిట్ అక్కరకు వచ్చేనా! -కార్టూన్

  ఐ.పి.ఎల్ మాజీ బాస్, బి.సి.సి.ఐ మాజీ ఉపాధ్యక్షుడు, పారిపోయిన నేరస్ధుడు అయిన లలిత్ మోడి వ్యవహారం రాజస్ధాన్ ముఖ్యమంత్రిని వదిలేట్లు లేదు. రాజస్ధాన్ అసెంబ్లీ ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చినా లలిత్ మోడీ వ్యవహారం సదరు క్లీన్ చిట్ ను వెక్కిరిస్తూనే ఉంది. లలిత్ మోడీపై ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కేసు, ఐ.పి.సి కేసు దాఖలు కావడంతో ఆయన లండన్ పారిపోయాడు. వలస వచ్చిన పక్షిగా అక్కడే సెటిల్ కావాలని నిర్ణయించుకుని అందుకు దశాబ్దాల నాటి…

ఇంతకీ మోడి యోగా చేస్తారా? -పుతిన్

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు రావలసిన సందేహమే వచ్చింది. ఎవరి ప్రయత్నము, ప్రోత్సాహము లేకుండానే సానుకూల గుణాల వల్ల ప్రపంచ వ్యాపితంగా విస్తరించిన యోగాను సైతం రాజకీయంగా సొమ్ము చేసుకునే పనిలో పడిపోయిన బి.జె.పి, నరేంద్ర మోడీలు బహుశా ఈ ప్రశ్నను ముందే ఊహించి ఉండవచ్చు. అయితే పుతిన్ నుండి ఈ ప్రశ్న వస్తుందని మాత్రం ఊహించి ఉండరు. అంతర్జాతీయ విలేఖరులతో మాట్లాడుతున్న సందర్భంలో ఐ.ఏ.ఎన్.ఎస్ (ఇండియా అబ్రాడ్ న్యూస్ సర్వీస్) వార్తా సంస్ధ విలేఖరి…

ఎ.పికి చిప్ప, బంగ్లాకు లప్ప!

ఆంధ్ర ప్రదేశ్ కు ఇవ్వడానికి లేని నిధులు బంగ్లాదేశ్ కు అప్పు ఇచ్చేందుకు ఎక్కడి నుండి వస్తాయి. దేశంలో ఒక రాష్ట్ర ప్రగతికి నిధులు లేనప్పుడు ఇతర దేశానికి రుణం ఇవ్వడం ఎలా సాధ్యం? అది కూడా ఒక ముస్లిం దేశానికి? లోటు బడ్జెట్ తో మూలుగుతున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి విభజన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి డబ్బు లేదని కేంద్రం చెప్పింది. ఇప్పుడేమో ఏకంగా 2 బిలియన్ డాలర్ల (సుమారు రు. 12 వేల…

వాలుకి విరుద్ధంగా… -ది హిందు ఎడిట్..

[జూన్ 4 నాటి ది హిందు ఎడిటోరియల్ ‘Against the grain’ కు ఇది యధాతధ అనువాదం. ఈ శీర్షిక ఆంగ్లంలో ఒక సామెత. కట్టెను వాలుగా కొస్తే త్వరగా తెగుతుంది తప్ప అడ్డంగా కోస్తే అనుకున్న ఫలితం రాదని ఈ సామెత సూచిస్తుంది. ఈ సామెత ప్రస్తావించడంలోనే ది హిందు ఉద్దేశ్యం అనుమానాస్పదంగా కనిపిస్తోంది. కానీ ఎడిటోరియల్ లో గమనార్హమైన పరిశీలనలు ఉన్నాయి.] ***************** “న్యాయమైన నష్టపరిహారం పొందే హక్కు మరియు భూ సేకరణ, పునరావాసం,…

మోడి స్నేహ హస్తం! -ది హిందు ఎడిట్..

[మే 27 నాటి ది హిందు ఎడిటోరియల్ “Modi reaches out” కు యధాతధ అనువాదం. -విశేఖర్] *************** సాధారణ ప్రజాస్వామిక పద్ధతులు నెలకొని ఉన్నప్పుడు ప్రధాని నరేంద్ర మోడి మరియు డా.మన్మోహన్ సింగ్ ల మధ్య జరిగిన లాంటి సమావేశం ఎలాంటి విమర్శలకు తావు లేకుండా జరిగిపోతుంది. ఒకసారి ఎన్నికల వేడి, శతృత్వాలు అంతరించడం అంటూ జరిగిన తర్వాత ప్రభుత్వ పాలన ఇక సహకార సంస్ధ తరహాలో మారిపోతుంది. అధికారం చేపట్టిన వ్యక్తి సలహా, సూచనల…

ప్రధాని, మాజీ ప్రధాని సమావేశం -కార్టూన్

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ప్రధాని నరేంద్ర మోడిని కలిశారు. వారి సమావేశంలోనే అంశాలు ఏమిటో ఎవరికి తెలియదు. మాజీ ప్రధాని మాట్లాడి వెళ్ళాక ప్రధాని నరేంద్ర మోడిగారే స్వయంగా వారిద్దరు చేతులు కలిపిన ఫోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఫోటోతో పాటు కొంత మేటర్ ఆయన రాశారు గానీ, అందులో వారి సమావేశంలోని అంశం ఏమిటో చెప్పలేదు. ట్రాయ్ (టెలికాం రెగ్యులేటరీ ఆధారిటీ ఆఫ్ ఇండియా) మాజీ అధిపతి భాయిజి తన ఉద్యోగ అనుభవాలను…

మోడి ద సూపర్ హీరో -కార్టూన్

“80 రోజుల్లో ప్రపంచాన్ని చుట్టి రావడమే తేలిక…” ************* గత యేడాదిలో పార్లమెంటు సమావేశాలకు అతి తక్కువ సార్లు హాజరైన ప్రధాన మంత్రిగా విమర్శలు ఎదుర్కొన్న ప్రధాని నరేంద్ర మోడి అదే సమయంలో ఒకే సంవత్సరంలో అత్యధిక సంఖ్యలో విదేశాలు పర్యటించిన ఘనతను కూడా దక్కించుకున్నారు. సంవత్సర కాలంలో ప్రధాని నరేంద్ర మోడి 18 దేశాలు పర్యటించడం మున్నేన్నడూ ఎరగనిది. ఆయన ముఖ్యమంత్రి ఉన్న పదేళ్ళ కాలంలో ఏయే దేశాలైతే ఆయనకు వీసా ఇవ్వడానికి నిరాకరించాయో ఆ…

ఢిల్లీ కోర్టు రూలింగ్: మోడిపై ఎఎపి గెలుపు

ఒక హెడ్ కానిస్టేబుల్ అవినీతి కేసులో ఢిల్లీ హై కోర్టు ఇచ్చిన తీర్పు ద్వారా ఢిల్లీలోని ఎఎపి ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న యుద్ధంలో ఎఎపి మొదటి గెలుపు నమోదు చేసింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ద్వారా ఎఎపి ప్రభుత్వం చేతుల్లో నుండి అధికారాలు గుంజుకోవడానికి గత కొద్ది వారాలుగా మోడి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నాలకు ఢిల్లీ హై కోర్టు ఇచ్చిన తాజా తీర్పు కళ్ళెం వేసింది. ఢిల్లీ పోలీసులపై…

ఎవరు జీరో, ఎవరు హీరో! -కార్టూన్

నరేంద్ర మోడి ఏడాది పాలనకు రాహుల్ గాంధీ ఇచ్చిన మార్కులు పదికి సున్నా (జీరో). ఈ మేరకు రాహుల్ గాంధీ స్వయంగా పార్లమెంటులో ప్రకటన చేశారు. కాంగ్రెస్ సభ్యులు ఆనందంగా బల్లలు చరిచారు. రాహుల్ గాంధీ లాంటి పిల్లగాడు తమ అధినేతను జీరోను చేస్తే బి.జె.పి నేతలు ఊరుకుంటారా? చస్తే ఊరుకోరు. వెంకయ్య నాయుడు గారి లాంటి ప్రాసల పండితులైతే అసలే ఊరుకోరు. “జీరోలకు జీరోలే కనిపిస్తారు. హీరోలు కనిపించరు” అని రాహుల్ విమర్శను ఆయన తిప్పి…

గాలి కబుర్ల పాలనకు ఏడాది -కార్టూన్

నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ – 2 అధికారం చేపట్టి ఏడాది అవుతోంది. అవడానికి ఎన్.డి.ఏ పాలన అయినప్పటికీ ఆచరణలో ఇది పూర్తిగా బి.జె.పి పాలన. ఈ ప్రభుత్వంపై వాజ్ పేయి భరించిన కూటమి ఒత్తిళ్ళు ఏమీ లేవు. శివసేన లాంటి నోరుగలిగిన భాగస్వాములను సైతం తొక్కి పెట్టగలిగిన ఎన్.డి.ఏ-2 పాలన పూర్తిగా బి.జె.పి పాలనగా చెప్పుకున్నా తప్పు లేదు. ఈ ఏడాది పాలన ఒట్టి గాలి కబుర్ల పాలనగా సాగిపోయిందని కార్టూనిస్టు సరిగ్గా చెప్పారు. ఇంకా చెప్పాలంటే…

చైనాకేనా, మనకూ ఉన్నారు టెర్రాకొట్ట వారియర్లు! -కార్టూన్

టెర్రాకొట్ట యుద్ధ వీరులు చైనాకు మాత్రమే ప్రత్యేకం. క్రీస్తు పూర్వం మూడో శతాబ్దంలో బతికిన మొట్ట మొదటి ఎంపరర్ షిన్ షి హువాంగ్ చనిపోయినపుడు ఆయనకు మరణానంతరం కూడా రక్షణ కల్పించే ఉద్దేశ్యంతో తయారు చేసినవే టెర్రాకొట్ట యుద్ధ వీరుల విగ్రహాలు. ఈ విగ్రహాలను ఎంపరర్ తో కలిపి ఒక క్రమ పద్ధతిలో పూడ్చిపెట్టారు. 1974లో మొదటిసారి ఇవి రైతుల కంట బడ్డాయి. అనంతరం జాగ్రత్తగా తవ్వకాలు జరిపి కొన్ని విగ్రహాలను బైటికి తీసి మ్యూజియంలో భద్రపరిచారు.…

రైతుల భూములపై రాహుల్ కి అంత ప్రేమ ఏల? -కార్టూన్

రాహుల్ గాంధీ సెలవు కాలం ముగించుకుని కలుగులోంచి వెలికి వచ్చారు. వచ్చీ రావడంతోనే రైతుల (కోసం) ర్యాలీ నిర్వహించి తన పునరాగమనాన్ని ఘనంగా చాటారు (లేదా చాటానని ఆయన అనుకున్నారు). ఆయన మాట్లాడినంత సేపూ జనం (ఎలాగో) ఉన్నారని, ఆయన ముగించి సోనియా గాంధీ మాట్లాడడం ప్రారంభించగానే జనం వెళ్లిపోవడం మొదలు పెట్టారని పత్రికలు గుస గుస రాశాయి. పునరాగమనం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడి తెచ్చిన భూ సేకరణ చట్ట సవరణ బిల్లుపై ఆయన నిప్పులు…

సర్వ మత హక్కులు కాపాడుతాం –మోడి

“ప్రతి పౌరుని యొక్క హక్కులను, స్వేచ్చను మేము రక్షించి కాపాడతాం. ప్రతి ఒక్క మతము, సంస్కృతి, నమ్మకాలకు చెందిన ప్రతి ఒక్క పౌరుడికి మా సమాజంలో సమాన స్ధానం ఉండేలా చూస్తాము. మా భవిష్యత్తులో నమ్మకాన్ని కల్పిస్తాము. ఆ భవిష్యత్తు సాధించేందుకు విశ్వాసం ఇస్తాము.” ఇవి ఫ్రెంచి గడ్డపై ప్రధాని నరేంద్ర మోడి పలికిన పలుకులు. ఫ్రెంచి నేల మనది కాదు. కనీసం మన పాత వలస ప్రభువు కూడా కాదు. ప్రధాని అక్కడికి వ్యాపార ఒప్పందాల…

రాఫెల్ కు స్వామి నో, మోడి యెస్

రాఫెల్ ఫైటర్ జెట్లు తక్షణ ప్రాతిపదికన ఏకంగా 36 కొనుగోలు చేసేందుకు ప్రధాని మోడి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఫ్రాన్స్ బయలుదేరుతూనే రాఫెల్ ఒప్పందం కుదురుతుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తూ వెళ్ళిన ప్రధాని చెప్పినట్లుగానే ‘పడవపై చర్చలు’ జరిపి భారీ కొనుగోలుకు తలూపారు. మనం ఇప్పుడు ఆర్డర్ ఇస్తే రాఫెల్ ఫైటర్ జెట్లు తయారు చేయడం కాదు. ఇప్పటికే తయారై ఎగరడానికి సిద్ధంగా ఉన్న ఫైటర్ జెట్ విమానాలనే ఇండియా కొనుగోలు చేయనుంది. జెట్ ఫైటర్ విమానాల కొనుగోలు…