క్లుప్తంగా… 26.04.2012

అంతర్జాతీయం హెచ్.ఎస్.బి.సి బ్యాంకు యు.కె శాఖల్లో 2,200 ఉద్యోగాలు రద్దు ఇంగ్లాండులో హెచ్.ఎస్.బి.సి బ్యాంకు మరో 2,200 ఉద్యోగాలు రద్దు చేసింది. వాస్తవంగా రద్దు చేసినవి 3,100 ఉద్యోగాలు కాగా, కొత్తగా ఇచ్చిన ఉద్యోగాలు పోను నికరంగా 2,217 ఉద్యోగాలు రద్దు చేసినట్లయింది. ఖర్చు తగ్గించుకునే చర్యల్లో భాగంగా ఉద్యోగాలు రద్దు చేస్తున్నట్లు బ్యాంకు ప్రకటించింది. హెచ్.ఎస్.బి.సి గత సంవత్సరం 7,000 ఉద్యోగాలు రద్దు చేసింది. 2013 లోపు ప్రపంచ వ్యాపితంగా 30,000 ఉద్యోగాలు రద్దు చేస్తానని…

గుజరాత్ నరమేధంపై అమెరికా కాంగ్రెస్ తీర్మానం సామ్రాజ్యవాద ప్రయోజనాల కోసమే

గుజరాత్ ముఖ్య మంత్రి నరేంద్ర మోడి ప్రత్యక్ష పర్యవేక్షణలో ముస్లిం లపై సాగిన దారుణ నరమేధం జరిగి దశాబ్దం పూర్తయిన సందర్భంగా అమెరికా ప్రతినిధుల సభ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. గుజరాత్ రాష్ట్రంలో అన్నీ మతాల వారూ మత స్వేచ్చతో బతికే సుహృద్భావ పూరిత వాతావరణం కల్పించాలని గుజరాత్ లోని నరేంద్ర మోడి ప్రభుత్వాన్ని ఆ తీర్మానం కోరింది. 2002 నాటి ‘ముస్లింల హత్యాకాండ’లో బాధితులైన వారికి నరేంద్ర మోడి ప్రభుత్వం సరైన న్యాయం కల్పించేందుకు ఎటువంటి…

శాకాహారులారా ఉరితీసుకొండి! పులిగారు శాఖాహారం బోధిస్తున్నారు

“ఒక ప్రఖ్యాత సామెత ఉంది. ‘ద్వేషం ఎన్నటికీ ద్వేషాన్ని జయంచలేదు’ అని. మన దేశానికి నిజమైన బలం తన ఐకమత్యం, సామరస్యంలలోనే ఉంది. ‘భిన్నత్వంలో ఏకత్వం’ అన్నది భారత దేశ నిర్వచనం. మన సామాజిక జీవనంలో ఐకమత్యాన్ని బలవత్తరం కావించడం మనపై ఉన్న బాధ్యత. సానుకూల దృక్పధంతో పురోగమించే అద్భుత అవకాశం మనకు చేజిక్కింది. కనుక, మనం ఒక్కటిగా కలిసి గుజరాత్ పరువును ఉద్దీపింపజేద్దాం. ఈ సామాజిక సామరస్యతను, సోదరభావాన్ని బలీయం చేసే బృహత్తర బాధ్యతలో భాగంగా…

నీతికి కట్టుబడ్డ పోలీసు అధికార్లపై సి.ఎం మోడి కక్ష సాధింపు!

గోధ్రా రైలు దుర్ఘటనను అడ్డు పెట్టుకుని గుజారాత్ లో ముస్లింలపై నెలరోజులకు పైగా నరమేధాన్ని సాగించిన ముఖ్యమంత్రి నరేంద్ర మోడి, ఇప్పుడు, తాను సాగించిన ఘోర కృత్యాలకు సాక్ష్యాలను విచారణా కమిషన్ కు అందిస్తున్నందుకు పోలీసు అధికారులను శిక్షించడానికి నిస్సిగ్గుగా తెగబడుతున్నాడు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి ముస్లింల మారణకాండకు స్వయంగా ఆదేశాలిచ్చాడనీ, అ ఆదేశాలిచ్చిన సమావేశంలో తాను కూడా పాల్గొన్నాననీ అయినా తన స్టేట్ మెంట్ ను విచారణ కమిషన్ రికార్డు చేయడం లేదని సుప్రీం…

‘ముస్లింల నరమేధం గుజరాత్ అంతర్గత వ్యవహారం’, అమెరికా రాయబారితో నరేంద్ర మోడి – 2

“దీనికి మోడి గుర్రుమంటూ ‘భారత జాతీయ మాన వహక్కుల సంఘం పక్షపాత పూరితమైనది. దాని నిర్ణయాల్లో తీవ్ర తప్పిదాలున్నాయి. అదీ కాక అమెరికా కొద్ది సంఖ్యలో ఉన్న చిన్న చిన్న ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్ధలపైనే ఆధారపడుతోంది. వాటికి వాస్తవ పరిస్ధితులేవీ తెలియదు. పైగా వాటికి స్వార్ధ ప్రయోజనాలున్నాయి. ఏదైమైనా అధికారులు తప్పు చేసినట్లయితే వారిని విచారించి, శిక్షించేందుకు కోర్టులున్నాయి. ముఖ్యమంత్రులు న్యాయ ప్రక్రియల్లో జోక్యం చేసుకోలేరు’ అని సమాధానమిచ్చాడు” అని ఓవెన్ రాశాడు.  కాన్సల్ జనరల్ దానికి…

‘ముస్లింల నరమేధం గుజరాత్ అంతర్గత వ్యవహారం’, అమెరికా రాయబారితో నరేంద్ర మోడి – 1

2002 సంవత్సరంలో గోధ్రా రైలు బోగీ దహనం అనంతరం నరేంద్ర మోడి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం నాయకత్వంలో ముస్లిం ప్రజలపై సాగించిన నరమేధానికి బాధ్యులైన వారిపై ఏం చర్య తీసుకున్నారు అనడిగిన అమెరికా రాయబారి ప్రశ్నకు కోపంతో, “అది గుజరాత్ అంతర్గత వ్యవహారం. ఆ విషయం గురించి ప్రశ్నించే అధికారం అమెరికాకు లేదు” అని నరేంద్ర మోడి హుంకరించిన విషయం అమెరికా రాయబారి రాసిన కేబుల్ ద్వారా వెల్లడయ్యింది. ఇండియాలో పని చేసిన అమెరికా రాయబారులు అమెరికా…