అవినీతి రాజకీయ వ్యవస్ధకు మోడి ప్రతినిధి -ఎఎపి

భారత దేశంలోని అత్యంత అవినీతిమయమైన రాజకీయ వ్యవస్ధకు మాత్రమే నరేంద్ర మోడి ప్రతినిధి అని ఆయన పార్టీ చెప్పుకుంటున్నట్లు మార్పుకు ప్రతినిధి ఎంత మాత్రం కాదని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. బహుశా మోడిని నేరుగా విమర్శించడం ఎఎపికి ఇదే మొదటిసారి కావచ్చు. అరవింద్ కేజ్రీవాల్ గతంలో కొన్ని విమర్శలు చేసినప్పటికీ అవి ‘కర్ర విరగకుండా, పాము చావకుండా’ అన్నట్లు సాగాయి. ఈసారి కూడా విమర్శ చేసింది మరో నాయకుడు ప్రశాంత్ భూషణ్, అరవింద్ కాదు. “కాంగ్రెస్,…

చిక్కుముడులు అవలీలగా దాటిన మోడి! -కార్టూన్

ది హిందు పత్రిక నుండి నరేంద్ర మోడీకి వచ్చిన ప్రశంసా ఇది? ప్రధాన మంత్రి పీఠం అధిరోహించేవైపుగా ప్రయాణం చేస్తున్న నరేంద్ర మోడి తన దారిలో ఎదురవుతున్న చిక్కు మూడులను అవలీలగా అధిగమించారని ఈ కార్టూన్ సూచిస్తోంది. తాడు మీద నడవడం చిన్న చిన్న సర్కస్ విద్యలు ప్రదర్శించేవారు చాలా తేలికగా ప్రదర్శించే విద్య. నరేంద్ర మోడి కేవలం తాడు మీద నడవడమే కాదు, తా తాడుపైన తల కిందులుగా కూడా నడిచి చిక్కు మూడులను అధిగమించారని…

మోడి రాతలపై బాధితుల ఆగ్రహం

జకియా జాఫ్రీ పిటిషన్ ను మెట్రోపాలిటన్ కోర్టు కొట్టివేసిన అనంతరం నరేంద్ర మోడి తన బ్లాగ్ లో రాసిన రాతల పట్ల మారణకాండ బాధితుల్లో కొందరు ఆగ్రహం ప్రకటించారు. మోడి మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని కొందరు వ్యాఖ్యానించగా ఆయన అనుభవించిన బాధ బైటపెట్టడానికి పన్నెండేళ్లు సమయం కావాలా అని మరి కొందరు ప్రశ్నించారు. ప్రధాన మంత్రి పదవి కోసమే మోడి కొత్తగా బాధ నటిస్తున్నారని వారు ఆరోపించారు. గోధ్రా రైలు దహనంలో కరసేవకుల దుర్మరణం చెందిన అనంతరం…

గుజరాత్ అల్లర్లు ఆయన్ని మొదలంటా కదిలించాయట!

దాదాపు పన్నెండేళ్ళ నుండి గుజరాత్ అల్లర్లపై స్పందించడానికి నిరాకరించిన నరేంద్ర మోడి ఇప్పుడు నోరు విప్పారు. తన హయాంలో గుజరాత్ మారణకాండ చోటు చేసుకున్నందుకు కనీసం విచారం ప్రకటించడానికి కూడా మొండిగా తిరస్కరించిన మోడి, జకియా జాఫ్రీ విన్నపాన్ని మెట్రోపాలిటన్ కోర్టు తిరస్కరించిన అనంతరమే స్పందించారు. అల్లర్లపై విచారణ చేయడానికి సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు నియమించబడిన స్పెషల్ ఇనివేస్టిగేషన్ టీం (సిట్) నరేంద్ర మోడికి క్లీన్ చిట్ ఇవ్వడాన్ని జకియా జాఫ్రీ సవాలు చేశారు. ఆమె…

మోడి మరియు మాధురి, ఒక అక్రమ నిఘా కధ

నరేంద్ర మోడి పై వచ్చిన స్నూపింగ్ ఆరోపణల కధ కేంద్ర ప్రభుత్వం చొరవతో రసకందాయంలో పడింది. ఒక అమాయక యువతి పట్ల మోహం పెంచుకున్న ‘సాహెబ్’ తన అనుంగు సహచరుడు అమిత్ షా కు ఆమెపై గూఢచర్యానికి పాల్పడమని ఆదేశాలు ఇవ్వడం, సదరు ఆదేశాలను అమిత్ తు.చ తప్పక పాటించడం, ఈ వ్యవహారాలన్నింటిని పరిశోధనాత్మక వార్తా పోర్టళ్ళు  కోబ్రా పోస్ట్, గులాయిల్ ఈక ఈక పీకి పెడుతుండడంతో గుజరాత్ ముఖ్యమంత్రిలోని మరో కోణం పచ్చిగా వెలుగు చూస్తోంది.…

విధానాల్లో తేడా లేదు, ఇక మిగిలింది బురద జల్లుడు -కార్టూన్

సోనియా ఎన్నికల హెచ్చరిక: బి.జె.పికి వేసే ఓటు మీ ఆరోగ్యాన్ని విషపూరితం చేస్తుంది. మోడి ఎన్నికల హెచ్చరిక: కాంగ్రెస్ కి వేసే ఓటు మీ ఆరోగ్యాన్ని విషపూరితం చేస్తుంది. *** ఎల్.కె.అద్వానీ కొన్ని వారాల క్రితం ఓ మాటన్నారు. ఇప్పుడిక దేశంలో రెండే రాజకీయ శిబిరాలున్నాయని వాటికి నాయకులు కాంగ్రెస్, బి.జె.పిలని ఆయన మాట సారాంశం. గతంలో కాంగ్రెస్ కి ప్రత్యామ్న్యాయమ్ ఉండేది కాదనీ అలాంటి పరిస్ధితుల్లో ప్రత్యామ్నాయం స్ధాయికి బి.జె.పిని అభివృద్ధి చేశానని ఆయన చెప్పుకోదలిచారు.…

అమెరికా ప్రతినిధుల సభలో మోడి వ్యతిరేక తీర్మానం

నరేంద్ర మోడికి అమెరికా వీసా కష్టాలు కొనసాగుతున్నాయి. భాజపా అధ్యక్షుడు రాజ్ నాధ్ సింగ్ అమెరికా పర్యటించినపుడు మోడి వీసా గురించి ప్రత్యేకంగా చర్చించినప్పటికీ ఫలితం దక్కినట్లు లేదు. అమెరికా ప్రతినిధుల సభ (House of Representatives)లో సోమవారం ప్రవేశ పెట్టబడిన తీర్మానం చూస్తే ఈ అనుమానం రాక మానదు. రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీలకు చెందిన ప్రతినిధులు ఉమ్మడిగా ప్రతిపాదించిన ఈ తీర్మానం, మోడీకి వీసా ఇవ్వరాదన్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నందుకు అమెరికాను ప్రశంసించింది. మరో వంక,…

మోడీ చరిత్ర పరిజ్ఞానం ఇంతేనా?

“మీకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశాం సర్, చారిత్రక పేర్ల గురించి ప్రస్తావించదలుచుకుంటే జస్ట్ గూగుల్ చేయండి చాలు!” ——— ప్రధాన  మంత్రి కాగోరేవారికి భారత దేశ చరిత్ర గురించి సరైన అవగాహన ఉండాలని భావించడంలో తప్పుకాదు. పైగా అదొక షరతు కూడా. దేశ చరిత్ర పైన అవగాహన లేనివారు దేశ రాజకీయ-ఆర్ధిక-విదేశాంగ విధానాలను ఎలా నిర్దేశిస్తారు? కానీ బి.జె.పి ప్రధాని అభ్యర్ధికి అత్యవసరమైన ఈ అవగాహన కొరవడిందని ఆయన ఉపన్యాసాలు చెబుతున్నాయి. రెండు సందర్భాల్లో ఆయన చారిత్రక అవగాహన…

రాహుల్, మోడీ: పంచింగ్ బ్యాగ్స్ -కార్టూన్

ఎన్నికల ప్రచారం మామూలుగా ఎలా ఉండాలి? పోటీ చేసే అభ్యర్ధులు తమ తమ నియోజకవర్గాలను ఎలా అభివృద్ధి చేస్తారో చెప్పాలి. నియోజక వర్గం సమస్యల పరిష్కారం దేశ భవిష్యత్తుతో ఎలా ముడి పడి ఉన్నాయో చెప్పగలగాలి. తమ తమ పార్టీల విధానాలను చెబుతూ అవి దేశాభివృద్ధికీ, నియోజకవర్గాల్లోని సమస్యల పరిష్కారానికీ ఎలా దోహదపడతాయో చెప్పాలి. కానీ జరుగుతున్నది అందుకు పూర్తిగా విరుద్ధం. ప్రత్యర్ధి పార్టీల నాయకులపైన ఎంత గొప్పగా విమర్శలు చేస్తే అంత గొప్ప ప్రచారంగా పార్టీల…

అగ్రరాజ్య హోదా అంటే లిబర్టీ విగ్రహాన్ని అనుకరించడమా? -కార్టూన్

– “అవి మన మన్ హట్టన్…. ఆకాశహర్మ్య విగ్రహాలు” – అక్టోబర్ 29 తేదీన కేంద్ర ప్రభుత్వ నిధులతో సర్దార్ పటేల్ మెమోరియల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మ్యూజియం ప్రారంభం అయితే, అక్టోబర్ 31 తేదీన గుజరాత్ ప్రభుత్వం ఆధ్వర్యంలో పటేల్ విగ్రహ నిర్మాణానికి శంకుస్ధాపన జరిగింది. గుజరాత్ ప్రభుత్వం ఆధ్వర్యంలో అంటే నరేంద్ర మోడి ఆధ్వర్యంలో అనుకోవాలి. ఆయన నిర్మించబోయే పటేల్ విగ్రహం ప్రపంచంలోనే అతి పెద్ద విగ్రహం అవుతుందట. న్యూయార్క్ నగరంలోని మన్ హటన్…

పటేల్ వారసత్వం ఎవరిది? -కార్టూన్

సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్! స్వతంత్ర భారతావనికి మొట్టమొదటి హోమ్ మంత్రిగా పని చేసి అనేక స్వతంత్ర సంస్ధానాలను భారత దేశంలో విలీనం కావడంలో ముఖ్యపాత్ర పోషించాడన్న కీర్తి సంపాదించిన వ్యక్తి. ఇప్పుడు ఆయన కీర్తి ప్రతిష్టలకు వారసత్వం పొందే హక్కు ఏ రాజకీయ పార్టీది అన్న మీమాంస తలెత్తింది. కాంగ్రెసా? లేక బి.జె.పి యా? ఈ రెండింటిలో ఏది హక్కుదారు? గుజరాత్ లోని పటేల్ మెమోరియల్ ట్రస్ట్ వారు పటేల్ స్మృతిలో ప్రపంచంలోనే అతి భారీ…

పటేల్ విగ్రహానికి కాణీ విదల్చని మోడి

దేశంలోని ఛానెళ్ల నిండా సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ విగ్రహ నిర్మాణం గురించి ప్రకటనల రూపంలో మారుమోగి పోతోంది. పటేల్ విగ్రహంతో పాటు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి బొమ్మ కూడా ఆ ప్రకటనల్లో కనిపిస్తోంది. విగ్రహ నిర్మాణం మొత్తం ఆది నుంచి అంతం వరకూ తానే నెత్తి మీద వేసుకుని మోస్తున్నట్లుగా సదరు ప్రకటనల్లో మోడి బిల్డప్ ఇస్తున్నారు. తీరా చూడబోతే ఈ మెమోరియల్ నిర్మాణం కోసం తన పదేళ్ళ పాలనలో నరేంద్ర మోడి ఒక్క…

నిర్బంధ ఓటింగు–అద్వానీ మరియు మోడి -కార్టూన్

సుప్రీం తీర్పు ప్రకారం ఓటింగ్ మిషన్ లో ‘None Of The Above’ (NOTA) బటన్ ను ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేసింది. పోటీ చేసే అభ్యర్ధుల్లో ఎవరూ నచ్చకపోతే NOTA మీట నొక్కాల్సి ఉంటుంది. కానీ NOTA ఓట్లు లెక్కించరాదని తీర్పులో పేర్కొన్న దృష్ట్యా ఈ మీటకు విలువ లేకుండా పోయింది, అది వేరే సంగతి! NOTA మీట ప్రవేశ పెడుతున్నారు కాబట్టి నిర్బంధ ఓటింగ్ ని అమలు చేయాలని నరేంద్ర మోడి ఒక ప్రతిపాదన…

బీహార్: మోడి ర్యాలీ స్ధలిలో బాంబు పేలుళ్లు

పాత మిత్రుడి రాష్ట్రాన్ని పలకరించడానికి వెళ్ళిన నరేంద్ర మోడిని బాంబు పేలుళ్లు ఆహ్వానించాయి. పాట్నాలో మోడి ప్రసంగించవలసిన వేదిక వద్దనే వరుసగా 6 బాంబు పేలడంతో ఐదుగురు చనిపోగా అరవై మందికి పైగా గాయపడ్డారని పత్రికలు చెబుతున్నాయి. పేలుళ్ళ పట్ల మోడి విచారం వ్యక్తం చేయగా ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తన పర్యటనను రద్దు చేసుకున్నారు. ప్రధాన మంత్రి ఆయనకు ఫోన్ చేసి కేంద్రం అన్ని విధాలా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. పాలక జనతా దళ్ (యు)…

దారికొచ్చిన అద్వానీ

“చూశావా మరి! వాళ్ళ మధ్య విభేదాలని ఇస్త్రీ చేసేసుకుంటారని నేను ముందే చెప్పలేదా?” మొత్తం మీద అద్వానీ దారికొచ్చారు. ఛత్తీస్ ఘడ్ పర్యటనలో నరేంద్ర మోడిపై ప్రశంసలు కురిపించడం ద్వారా బి.జె.పి వృద్ధాగ్ర నేత లాల్ కృష్ణ అద్వానీ మోడి ప్రధాని అభ్యర్ధిత్వానికి ఆమోదం తెలిపారు. మోడికి ప్రధాన మంత్రి అభ్యర్ధిత్వం కట్టబెట్టడం ద్వారా బి.జె.పి చేసిన ప్రయత్నం సఫలం అయితే దేశం అంతా గుజరాత్ నమూనా విస్తరిస్తుందన్న ఆశాభావాన్ని కూడా అద్వానీ వ్యక్తం చేశారు. ‘బోడి,…