విభిన్న చరిత్ర, సంస్కృతులను గుర్తుకుతెచ్చే దీపావళి -ఫోటోలు

చెడుపై మంచి విజయం సాధించినందుకు గుర్తుగా దీపావళి జరుపుకుంటున్నామని హిందూ పండితులు చెబుతారు. నరకాసుర వధకు గుర్తుగా ఆనందంగా జరుపుకునేది దీపావళి పండగ అని కొందరు చెబితే రావణుడిని జయించి రాముడు అయోధ్యకు చేరిన సందర్భంగా జరుపుకునే పండగ దీపావళి అని మరి కొందరు చెబుతున్నారు. సిరులు కురిపించమని కోరుతూ దీపావళి సందర్భంగా భాగ్యలక్ష్మిని కొలిచే సంప్రదాయం కూడా దేశంలో అనేకచోట్ల ఉన్నది. బంది చోర్ దివస్ పేరుతో సిక్కు మతస్ధులు దీపావళి రోజునే స్వర్ణ దేవాలయాన్ని…