ఆఫ్రికాలో ఆల్-ఖైదా బూచి, మాలిలో ఫ్రాన్సాఫ్రిక్

ప్రపంచంలో ఏ మూలైనా సరే, ఆల్-ఖైదా ఉనికి గురించి ఆందోళన మొదలయిందంటే, అక్కడ పశ్చిమ రాజ్యాలు సైనిక జోక్యానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాయని అర్ధం. దేశాల సార్వభౌమ హక్కులను కాలరాస్తూ సైనికంగా జోక్యం చేసుకోవాలని భావించినా, దేశాధ్యక్షుల భవనాలపై బాంబింగ్ కి నిర్ణయం జరిగినా, లేదా ఇంకేదైనా చట్ట విరుద్ధమైన అక్రమ చర్యలకు దిగుతున్నా, అమెరికాతో పాటు ఇతర పశ్చిమ రాజ్యాలు ఇన్నాళ్లు కమ్యూనిస్టు బూచిని చూపేవారు. కమ్యూనిస్టు బూచి చూపే అవకాశం లేని చోట్ల మాదక ద్రవ్యాల…

విమోచనా కూడలిని వదలని ఈజిప్టు ఆందోళనకారులు, పెదవి విప్పని సైన్యం

  ముబారక్ గద్దె దిగిపోయాక ఇళ్ళకు వెళ్ళిపోతారనుకున్న ఈజిప్టు ఆందోళనకారులు తాహ్రిరి స్క్వేర్ (విమోచనా కూడలి) ను ఇంకా వదిలి వెళ్ళలేదు. ప్రజాస్వామ్య పరిపాలన స్ధాపించబడే వరకు తాము వెళ్ళేది లేదని వారు పంతం పట్టారు. శనివారం సాయంత్రం సైన్యం ప్రదర్శకులను పంపించివేయటానికి ప్రయత్నించి విఫలమయ్యారు. కాగా ఆందోళన ప్రారంభ దినాల్లో ప్రదర్శకులపై హింసాత్మక దాడులు జరిపి వందల మంది మరణించడానికి కారకులై ప్రజల్లో అపఖ్యాతి పాలైన మిలట్రీ పోలీసులు తిరిగి “విమోచనా కూడలి” వద్ద మొహరించడం…