నయాగరా జలపాతమే గడ్డకట్టిన కాలం… -ఫోటోలు
ప్రపంచంలో అత్యంత ఎత్తైన జలపాతం నయాగరా అని మనకి తెలిసిందే. గుర్రపు డెక్క ఆకారంలో ఉండే ఈ భారీ జలపాతం నిత్యం సందర్శకులను ఆకర్షిస్తూ ఎల్లప్పుడూ రద్దీగా ఉంటుంది. ఫొటోల్లో చూస్తేనే గుండెలు గుభిల్లుమానిపించే ఈ జలపాతం గడ్డ కడితే?! పోలార్ వొర్టెక్స్ పుణ్యమాని అటువంటి అరుదైన ప్రకృతి దృశ్యం మనిషి కళ్ల ముందు ఆవిష్కృతం అయింది. అమెరికా, కెనడాల సరిహద్దులో విస్తరించి ఉండే నయాగరా జలపాతం వద్ద చరిత్రలో అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో…
