ముస్లిం ప్రార్ధనల్లో క్రమ శిక్షణే వేరు -ఫోటోలు
ముస్లిం మతావలంబకుల ప్రార్ధనలో క్రమ శిక్షణ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఒంటరిగా ప్రార్ధించినా / నమాజు చేసినా లేదా వందలు, వేలు, లక్షల మంది ప్రార్ధనల్లో పాల్గొన్నా వారు క్రమ శిక్షణ తప్పరు. బహుశా క్రైస్తవ మత ప్రార్ధనల్లో కూడా క్రమ శిక్షణ ఉంటుందనుకుంటాను. క్రమ శిక్షణ అంటే నా ఉద్దేశ్యం హంగూ, ఆర్భాటాలు, శబ్దం, హడావుడి ఇత్యాదులు ఉండవని. ఇవే కాకుండా ఒక వరుస వెనుక మరొక వరుసలో ఎవరూ చెప్పనవసరం లేకుండానే, నిర్వాహకులు అనేవారి అవసరం…
