స్ట్రాస్ కాన్ రేప్ కేసు మెడికల్ రిపోర్టు లీక్, కాన్‌పై బలపడిన అనుమానాలు
ఐ.ఎం.ఎఫ్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ డొమినిక్ స్ట్రాస్ కాన్, ఒక హోటల్ మెయిడ్ ని రేప్ చేసినట్లు ఆరోఫణలు రావడంతో తన పదవికి రాజీనామా చేసిన సంగతి విదితమే. గినియాకి చెందిన మహిళ “నఫిస్సాటౌ దియల్లో (32 సం.లు) న్యూయార్క్ మన్‌హట్టన్ లోని ఒక హోటల్ లో మెయిడ్ గా పనిచేస్తోంది. అప్పటి ఐ.ఎం.ఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ డొమినిక్ స్ట్రాస్ కాన్ అదే హోటల్‌లోని లగ్జరీ సూట్ లో దిగాడు. ఆ సందర్భంగా కాన్ సూట్ ని…