స్ట్రాస్ కాన్ పై కేసు ఉపసంహరించుకున్న న్యూయార్క్ ప్రాసిక్యూటర్లు

ఐ.ఎమ్.ఎఫ్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ డొమినిక్ స్ట్రాస్ కాన్ పై రేప్ ఆరోపణలను ఉపసంహరించుకుంటున్నట్లుగా ప్రాసిక్యూటర్లు కోర్టుకు తెలిపారు. దీనితో న్యూయార్క్ హోటల్ మెయిడ్ ను రేప్ ప్రయత్నం చేశాడంటూ స్ట్రాస్ కాన్ పై వచ్చిన ఆరోపణల కేసు పూర్తిగా రద్దయినట్లే. బాధిత మహిళ ప్రవేటు కేసు దాఖలు చేస్తే తప్ప స్ట్రాస్ కాన్ మళ్ళీ కోర్టు గడప తొక్కనవసరం లేదు. బాధిత మహిళ సాక్ష్యం ద్వారా ‘అనుమాన రహితంగా’ రేప్ కేసును రుజువుచేయగలమన్న నమ్మకాన్ని ప్రాసిక్యూటర్లు…