నటి సమంతపై కురుస్తున్న మగహంకార విద్వేషం
నటి సమంత, నటుడు నాగ చైతన్య అక్కినేని ఇటీవల విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా తమ ప్రైవసీకి భంగం కలిగించరాదని వారిద్దరూ ఒక ఉమ్మడి ప్రకటనలో విన్నవించుకున్నారు. తాము కొత్త జీవితం ప్రారంభిస్తున్నామని చెబుతూ అందుకు తమను ఆశీర్వదించాలని వేడుకున్నారు. వారి విన్నపంలో అర్ధం కాని అంశాలు ఏమీ లేవు. తమ ఏకాంతానికి భంగం కలిగించడం అంటే ఏమిటి అర్ధం? విడాకుల విషయంలో ఇప్పటికే బాధలో ఉన్న జంట తమ ప్రైవసీని తమకు వదిలేయండని కోరితే…
