భగత్ సింగ్ వీర మరణాన్ని అవమానించిన రైల్వే మంత్రి
తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన దినేష్ త్రివేది గురువారం రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఛార్జీలు పెంచి రు. 36,200 కోట్లు అదనంగా ఈ సంవత్సరం ఆదాయం పెంచబోతున్నట్లు ఆయన ప్రకటించాడు. అంత పెద్ద మొత్తం లో ఛార్జీలు వడ్డించి కూడా తాను చాలా తక్కువ పెంచానని ప్రకటించాడు. పైగా సామాన్య మానవుడిని దృష్టిలో పెట్టుకుని ఛార్జీలు పెంచానని చెప్పడానికి కూడా సాహసించాడు. ఛార్జీలు పెంచి ఐ.సి.యు లో ఉన్న రైల్వేలను బైటికి తెచ్చానని గొప్పలు…
