నగదు బదిలీ: మోడి చెప్పింది అబద్ధం! -కాగ్
అబద్ధం! అబద్ధం!! అబద్ధం!!! తమ ప్రభుత్వం గొప్పతనాల గురించి, సాధించిన బృహత్కార్యాల గురించి బిజేపి నేతలు చెప్పేవి అన్నీ అబద్ధాలే. జిఎస్టి బిల్లు ఆమోదింపజేసుకోవడానికి ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ రాజ్యసభలోనే అబద్ధం ఆడేస్తారు. నగదు బదిలీ పధకం దేశానికి భలే ఒరగబెట్టిందని చెప్పడానికి ప్రధాన మంత్రి చాలా తేలికగా వేల కోట్ల అబద్ధాన్ని ఆడేస్తారు. బిజేపి ప్రభుత్వ నేత, ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ఈ అబద్ధాల కార్యక్రమానికి నాయకత్వం వహించడం ఒక విడ్డూరం. అత్యున్నత…
