“న్యాయం కోసం నేలపై పడుకున్నాం,” పిల్లలు చూపుతున్న పోరు దారి -ఫోటోలు
పోస్కో: దక్షిణ కొరియాకి చెందిన బహుళజాతి సంస్ధ. ఐదేళ్ళనుండి ఒడిషాలోని ఐదు గ్రామాల ప్రజల బతుకులపై కొట్టడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ముడుపులు మెక్కి కొందరు, ప్రపంచ పెట్టుబడికి సలాం కొట్టి మరికొందరు, భారత పాలకులే ఈ ప్రజల పాలిట యమదూత లయ్యారు. తమలపాకు తోటలపై ఆధారపడి కుంటుతూనే గడుపుతున్న వీరి జీవితాల్లోకి విషం పోశారు. రు.50,000 కోట్ల విదేశీ పెట్టుబడికి సలాం కొట్టిన మన్మోహన్, నవీన్‌లు తమకు ఓట్లేసిన గ్రామీణుల నోట్లో మట్టి కొట్టారు. తమలపాకు తోటల్ని…