కొలువిస్తామని మత మార్పిడి, హిందూ సంస్ధల ‘ఏ’కృత్యం?

హిందువులు ముస్లిం మతంలోకి మారినా, బాప్తిజం పుచ్చుకుని క్రైస్తవ మతంలోకి వెళ్ళినా ఆర్.ఎస్.ఎస్, దాని అనుబంధ సంస్ధలు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ‘లవ్ జిహాద్’ అంటూ స్వకపోల కల్పిత కుట్రలను కూడా సృష్టించి కులాతీత, మతాతీత ప్రేమ వివాహాలకు మతం రంగు పులమడం వారికి ఇష్టమైన కార్యక్రమం. అలాంటి హిందూ అతివాద సంస్ధలు తమ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఉద్యోగాలు ఇప్పిస్తాం, ప్రభుత్వ పధకాలు ఇప్పిస్తాం, అని ఆశ చూపుతూ ముస్లింలను హిందూ మతంలోకి…