ధర్డ్ ఫ్రంట్: మద్దతిస్తాం… అబ్బే, ఇవ్వం… -ఎఎపి

ఆం ఆద్మీ పార్టీ విధాన పరమైన లోపభూయిష్టత, అయోమయం కొనసాగుతున్నట్లు కనిపిస్తోంది. బి.జె.పి కూటమి అధికారంలోకి రాకుండా నిరోధించడానికి అవసరమైతే ధర్ట్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటుకు అంశాల వారీ మద్దతు ఇస్తామని ఆ పార్టీ సీనియర్ నేత గోపాల్ రాయ్ ఆదివారం (మే 11) వారణాసిలో ప్రకటించారు. కానీ అంతలోనే పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ అదేం లేదని స్పష్టం చేశారు. అవినీతి నాయకులతో నిండిన నాయకులకు తమ పార్టీ ఎలాంటి మద్దతూ ఇవ్వదని ఆయన స్పష్టం…

ఫెడరల్ ఫ్రంట్, ఆల్టర్నేట్ ఫ్రంట్… ఏది ధర్డ్ ఫ్రంట్?

దేశంలో నాలుగో కూటమి రూపు దిద్దుకుంటున్నట్లు కనిపిస్తోంది. నిన్నటి దాకా వామపక్ష పార్టీలతో సీట్ల సర్దుబాటుకోసం చర్చలు జరిపిన జయలలిత లెఫ్ట్ తో చర్చలు ముగిస్తున్నట్లు హఠాత్తుగా ప్రకటించారు. దానితో వామపక్షాలు, ఇతర కిచిడి పార్టీలు ఏర్పాటు చేసిన ‘ఆల్టర్నేట్ ఫ్రంట్’ లో జయలలిత చేరిక ఆగిపోయింది. ఎ.ఐ.డి.ఏం.కె అధినేత్రి వామపక్షాలతో ఎన్నికల బంధం తెంచుకోవడం ఒక ఎత్తయితే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీకి ఫోన్ చేయడం మరో ఎత్తు. ఈ ఫోన్ కాల్ తో…

‘మూడో కూటమి’ అను ఓ ప్రహసనం -కార్టూన్లు

భారత దేశంలో గిరాకీ లేని ప్రాంతీయ పార్టీలు, వామపక్ష పార్టీలు కలిసి అప్పుడప్పుడూ చేసే తాటాకు చప్పుళ్లను ‘మూడో కూటమి’ అని పిలుస్తుంటారు. ఈ చప్పుళ్ళు ఎక్కువగా సరిగ్గా సాధారణ ఎన్నికలకు ముందే వినబడతాయి. ఎన్నికలు ముగిస్తే చాలు, అవిక వినపడవు. ఖర్మ కాలి కాంగ్రెస్ కూటమి (ఒకటో కూటమి?), బి.జె.పి కూటమి (రెండో?) లకు ప్రభుత్వం ఏర్పాటు చేయగల మెజారిటీ రాకపోయినా లేదా ఈ మూడో కూటమి బ్యాచ్ లోని పార్టీలు మొదటి, రెండవ కూటమిలలో…

పురచ్చి తలైవి రెండాకులు ఎక్కడ పూసేను? -కార్టూన్

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఇప్పుడు ఇతర రాజకీయ పార్టీలకు ‘అందని ద్రాక్ష’ ఆ ద్రాక్ష పండు భవిష్యత్తులో ఎవరికి తీపిని ఇస్తుందో ఎవరికి పుల్లదనాన్ని మిగుల్చుతుందో తెలియక జుట్టు పీక్కుంటున్నారు. 2జి కుంభకోణం దరిమిలా ఎ రాజా, దయానిధి మారన్ లపై నమోదయిన సి.బి.ఐ కేసులు డి.ఎం.కె పార్టీని అవాంఛనీయ పార్టీగా అందరూ చూస్తుండగా అన్నా డి.ఎం.కె ఆకర్షణీయంగా మారిపోయింది. పార్టీ అధినేత్రి, పురచ్చి తలైవి, జయలలిత తన రెండాకుల గుర్తును ఏ కూటమికి కానుకగా ఇస్తుందన్నది…

రెక్కలు కట్టుకుంటే మాత్రం ఎగరగలమా? -కార్టూన్

రైట్స్ సోదరులు విమానం కనిపెట్టక ముందు మనిషి గాలిలో ఎగరడానికి అనేక ప్రయత్నాలు చేశారు. కొందరు ఉత్సాహపరులు పక్షి రెక్కల లాగా అట్టలతో రెక్కలు తయారు చేసుకుని చేతులకు కట్టుకుని కొండలపైకి ఎక్కి దూకడం కూడా చేశారట. అలాంటివారు అనేకమంది చనిపోగా మరి కొందరు వికలాంగులు అయ్యారని చిన్నప్పుడు చదువుకున్నాం. భారత దేశంలో ధర్డ్ ఫ్రంట్ కోసం ములాయం సింగ్ చేస్తున్న ప్రయత్నాలను అలా రెక్కలు కట్టుకుని పక్షిలా ఎగరాలని ప్రయత్నించడంగా కార్టూనిస్టు పోల్చారు. రెక్కలు కట్టుకుని…