ఎఫ్.డి.ఐల దోపిడీ, భారతీయ పాలకులు మేధావుల సహకారం

మార్చి 2024తో ముగిసిన ఆర్ధిక సంవత్సరంలో ఇండియా లోకి ఎఫ్.డి.ఐల రాబడి గత ఆర్ధిక సంవత్సరం (FY 2023) తో పోల్చితే ఏకంగా 62 శాతం పడిపోయినట్లు ఆర్.బి.ఐ ప్రకటించిన గణాంకాలు తెలియజేస్తున్నాయి.

2023-24 ఆర్ధిక సం. లో దేశం లోకి వచ్చిన నికర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్.డి.ఐ) కేవలం 10.58 బిలియన్ డాలర్లు మాత్రమే.

చుక్కల్లో ఆహార ద్రవ్యోల్బణం

ఆహార ద్రవ్యోల్బణం చుక్కల్లో విహరిస్తోంది. రెండంకెల సంఖ్యను చేరువగా వెళుతోంది. అంటే దేశంలో ఆహార ధరలు కూడా చుక్కల్లో విహరిస్తున్నాయని అర్ధం. ఆహార భద్రత గురించి గుర్తొచ్చినప్పుడల్లా ఉపన్యాసాలు దంచే ప్రధాని మన్మోహన్ అది సాధించడానికి ఏ చర్యా తీసుకోడు. మంత్రులు, అధికారుల అవినీతి జన్ లోక్ పాల్ బిల్లువలన ఎక్కడ బయటపడుతుందోనన్న ఆందోళన తప్ప దేశంలో ప్రజానీకానికి తిండిని అందుబాటులో ఉంచాలన్న ధ్యాస లేదు. ఆగస్టు 13 తో ముగిసిన వారానికి ఆహార ద్రవ్యోల్బణం 9.8…