ధనికుడి ఆర్ధిక సంక్షోభం, దరిద్రుడి ఆకలి సంక్షోభం -కార్టూన్

ప్రపంచం ఇప్పుడు సంక్షోభాలతో నిండిపోయింది. ఏ పత్రిక చూసినా, ఏ ఛానెల్ చూసినా అమెరికా రుణ సంక్షోభం, యూరప్ రుణ సంక్షోభం, రుణ సంక్షోభం ఆసియాను తాకుతుందా? చైనా, ఇండియాల పరిస్ధితి ఏమిటి? జర్మనీ, ఫ్రాన్సులు యూరప్‌ని ఒడ్డుని చేరుస్తాయా? ఈ ప్రశ్నలే ఎల్లెడలా! వీటన్నింటికీ అతీతంగా సర్వకాల సర్వావస్ధల యందు కూడా ఆకలి సంక్షోభం లో ఉన్నవారి సంగతి ఎవరికీ పట్టదు, అప్పుడప్పుడూ వచ్చే పరిశోధనాత్మక వ్యాసాలు తప్ప. 2008 ఆర్ధిక సంక్షోభం రాగానే ప్రపంచ…