పాకిస్ధాన్‌కి 50 ఫైటర్ జెట్స్ సరఫరాకు చైనా అంగీకారం

పాకిస్ధాన్ కు గతంలో హామీ ఇచ్చిన దాని కంటే ఎక్కువ ఫైటర్ జెట్లను సరఫరా చేయడానికి చైనా అంగీకరించినట్లు తెలుస్తోంది. పాక్ ప్రధాని యూసఫ్ రజా గిలాని ప్రస్తుతం చైనా పర్యటిస్తున్న సంగతి విదితమే. లాడెన్ ను అబ్బోత్తాబాద్ లో అమెరికా కమెండోలు చంపిన తర్వాత పాక్ అమెరికా ల మధ్య సంబంధాలు బెడిసి కొట్టినట్లు పత్రికలు కోడై కూస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే అమెరికా కాకుంటే తమకు చైనా మిత్ర దేశం అండగా ఉండగలదన్న సూచనలు ఇవ్వడానికి…