టర్కీ ప్రధాని ‘ఎర్డోగాన్’ ద్విపాత్రాభినయం
టర్కీ ప్రధాని రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ మూడో సారి ప్రధానిగా ఎన్నికయ్యాడు. ఈయన 2003 నుండి ప్రధానిగా అధికారంలో ఉన్నాడు. మూడోసారి కొంత మెజారిటీ తగ్గినా ప్రభుత్వం ఏర్పరచడానికి తగిన మెజారిటీ సంపాదించగలిగాడు. రెండో సారి అధికారానికి వచ్చినప్పటినుండి ఈయన పాలస్తీనా స్వతంత్రానికి మద్దతు తెలుపుతూ, ఇజ్రాయెల్ కి కోపం వచ్చే మాటలు మాట్లాడుతూ పశ్చిమాసియాలో ముస్లింల ప్రయోజనాలు కాపాడే ఛాంపియన్ గా టర్కీని నిలపడానికి బాగా ప్రయత్నిస్తూ వచ్చాడు. పశ్చిమాసియాలో ప్రాంతీయంగా ఇరాన్ తో పోటీపడి…