ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం కోసం రిజర్వ్ రేట్లను మళ్ళీ పెంచిన చైనా
ప్రపంచంలో రెండో పెద్ద ఆర్ధిక వ్యవస్ధను కలిగి ఉన్న చైనా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం కోసం ఆర్.ఆర్.ఆర్ ను మళ్ళీ 50 బేసిస్ పాయింట్ల మేరకు (0.5 శాతం) పెంచింది. బ్యాంకు ఖాతాదారుల సొమ్ము భద్రత కోసం బ్యాంకులు సేకరించే డిపాజిట్లలో కొంత శాతాన్ని సెంట్రల్ బ్యాంకు వద్ద రిజర్వ్ డబ్బుగా ఉంచాలి. అలా రిజర్వు డబ్బుగా డిపాజిట్లలో ఎంత శాతం ఉంచుతారో దాన్ని చైనాలో ఆర్.ఆర్.ఆర్ (రిజర్వ్ రిక్వైర్మెంట్ రేషియో) అనీ, ఇండియాలో సి.ఆర్.ఆర్ (కేష్ రిజర్వ్…