రాజీనామాలు చేసింది రాజ్యాంగ సంక్షోభం సృష్టించడానికి కాదు -కాంగ్రెస్ మంత్రులు

తాము రాజీనామా చేసింది రాజకీయ లేదా రాజ్యాంగ సంక్షోభం సృష్టించడానికో, కాంగ్రెస్ హైకమాండ్‌ను ధిక్కరించడానికో కాదనీ తెలంగాణ ప్రజల్లో ప్రత్యేక రాష్ట్రం పట్ల ఉన్న బలీయమైన ఆకాంక్షను కాంగ్రెస్ హైకమాండ్ కి తెలియజేయడానికేనని సీనియర్ మంత్రి జానారెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ చెప్పారు. అనివార్య పరిస్ధితుల రీత్యానే తెలంగాణ ఎం.ఎల్.ఎ లు తమ పదవులకు రాజీనామా చేస్తున్నారని, తమ రాజీనామాలద్వారా తెలంగణ రాష్ట్ర సంక్షోభానికి పరిష్కారం కనుగునడానికి వారు ప్రయత్నిస్తున్నారని ఆయన తెలిపాడు. డిసెంబరు 9, 2009 తేదీన…