రూపాయి విలాపం, చిదంబరం చిద్విలాసం

ఒక పక్క రూపాయి, పతనంలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంటే, మరొక పక్క ఆర్ధిక మంత్రి చిదంబరం చిద్విలాసం కూడా కొనసాగుతోంది. దేశీయంగా ఆర్.బి.ఐ, ప్రభుత్వం తీసుకోవలసిన అన్ని చర్యలూ తీసుకుంటున్నామనీ, కానీ విదేశాల్లో పరిస్ధితుల వలన రూపాయి పతనం అవుతోందని నిన్నటి వరకూ మంత్రి చెబుతూ వచ్చారు. మంగళవారం సరికొత్త స్ధాయికి రూపాయి పతనం అయిన తర్వాత ఆయన కూడా సరికొత్త పల్లవి అందుకున్నారు. విదేశాల పరిస్ధితులే కాకుండా దేశంలోని పరిస్ధితులు కూడా పతనానికి కారణం అని…