చైనా సేనలు వెనక్కి వెళ్లాయోచ్!
యు.పి.ఎ ప్రభుత్వానికి ఒక తలనొప్పి తప్పినట్లుంది. దౌలత్ బేగ్ ఒల్డీ సెక్టార్ లో 19 కి.మీ మేర భారత భూభాగంలోకి చొచ్చుకుని వచ్చాయని ఆరోపించబడిన చైనా సేనలు వెనక్కి వెళ్లిపోయాయి. చైనా చొరబాటుకు ప్రతిగా చైనా సైనిక గుడారాలకు 300 కి.మీ దూరంలోనే మరో శిబిరం ఏర్పాటు చేసిన భారత సేనలు కూడా వెనక్కి వచ్చేశాయని తెలుస్తోంది. ఉన్నతస్ధాయి చర్చల అనంతరం ఈ ఆకస్మిక పరిణామం జరిగింది. ఇరు సేనలు నాలుగు పతాక సమావేశాలు జరిపినా ముగిసిపోని…