రేమండ్ డేవిస్ ని గుర్తు చేసుకో అమెరికా! -పాక్ మాజీ రాయబారి
అమెరికాలోని పాకిస్తాన్ ఎంబసీలో మాజీ అత్యున్నత రాయబారిగా పని చేసిన హుస్సేన్ హక్కాని అమెరికా పౌరుడు, సి.ఐ.ఏ గూఢచారి రేమండ్ డేవిస్ ఇద్దరు పాక్ పౌరులను కాల్చి చంపిన కేసు విషయంలో పాక్ ప్రభుత్వ అసంతృప్తికి గురై ఉద్వాసన పొందడం విశేషం. “అనేక దేశాలలో అమెరికా రాయబారులకు అక్కడి చట్టాలకు అతీతమైన సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి… విదేశాల్లోని ప్రతి అమెరికా రాయబార భవనం చుట్టూ రక్షణ నిర్మాణాలు (barriers) అమర్చి ఉంటాయి. సాధారణంగా ఈ నిర్మాణాలు ప్రజల…
