దేవయాని కేసు రద్దు చేసేది లేదు -అమెరికా

భారత ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నట్లుగా దేవయాని ఖోబ్రగదే పైన మోపిన కేసులను రద్దు చేయబోమని అమెరికా నిర్ద్వంద్వంగా ప్రకటించింది. ఇందులో మరో ఆలోచనకు తావు లేదని తేల్చి చెప్పింది. సంగీతా రిచర్డ్స్ పై ఢిల్లీలో నమోదు చేసిన కేసు విషయంలో భారత ప్రభుత్వం అనేకసార్లు విజ్ఞప్తులు చేసినప్పటికీ అమెరికా పట్టించుకోలేదన్న ఆరోపణను కూడా అమెరికా తిరస్కరించింది. భారత ప్రభుత్వంతో తాము నిరంతరం సమాచారం ఇచ్చి పుచ్చుకుంటూనే ఉన్నామని అమెరికా వాదించింది. పైగా ఇండియాయే తమ లేఖలకు స్పందించలేదని…