“దైవ దూషణ” హత్య నిందితుడికి పాక్ కోర్టు మరణ శిక్ష
“దైవ దూషణ”కు పాల్పడ్డాడంటూ పాకిస్ధాన్ లోని రాష్ట్ర గవర్నర్ ను దారుణంగా కాల్చి చంపిన పోలీసు అధికారికి పాకిస్ధాన్ కోర్టు మరణ శిక్ష విధించింది. పాకిస్ధాన్ లో ‘దైవ దూషణ’ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్ గవర్నర్ సల్మాన్ తసీర్ అనేక సార్లు ఉపన్యాసాలు ఇచ్చాడు. అటువంటి చట్టాలు ప్రజాస్వామిక వ్యవస్ధలకు ఆటంకాలని పేర్కొంటూ వాటిని రద్దు చేయాలని తస్సీర్ ప్రచారం చేశాడు. బ్లాస్ఫెమీ నేరానికి శిక్ష పడ్డ ఆసియా బీబీ అనే వ్యక్తి శిక్షకు వ్యతిరేకంగా ప్రచారం…