ఐ.ఎ.ఎస్ లను తంతే…..?–కార్టూన్

ఏం జరుగుతుందో తెలియడానికి ఇంతకు మించి వివరంగా బహుశా ఎవరూ చెప్పలేరేమో! ఐ.ఎ.ఎస్ లను ‘అయ్యా, ఎస్’ లు అని ఆంధ్ర ప్రదేశ్ జనం చెప్పుకుంటారు. వారు అలా ‘అయ్యా, ఎస్’ అని ఎందుకు అనవలసి వస్తోందో ఉత్తర ప్రదేశ్ అధికారి దుర్గాశక్తి నాగపాల్ ఉదాహరణ స్పష్టం చేస్తోంది. అధికారులకు కూడా స్పష్టమైన రూల్స్ ని ప్రభుత్వ గ్రంధాల్లో నిర్దేశించి ఉంచారు. కానీ రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లు, కంపెనీల స్వార్ధ ప్రయోజనాల కోసం వీటిని నీరుగార్చడం లోనే…

కదల్పూర్ లో దుర్గాశక్తి నాగపాల్ -ఫోటోలు

ఈ ఫోటోలను ఫస్ట్ పోస్ట్ పత్రిక ప్రచురించింది. ఐ.ఏ.ఎస్ అధికారి, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ అయిన దుర్గాశక్తి మసీదు కూల్చివేత సమయంలో అక్కడ లేరని లీక్ అయిన లోకల్ ఇంటలిజెన్స్ వర్గాల నివేదిక చెబుతోందని, వాస్తవానికి ఆమె అక్కడే ఉన్నారని ఈ ఫోటోల ద్వారా తెలుస్తోందని సదరు పత్రిక అట్టహాసంగా ప్రకటించింది. సంఘటన స్ధలంలో ఉన్న స్ధానికులు తమ సెల్ ఫోన్ ద్వారా ఈ ఫోటోలు తీశారనీ, వారి వద్ద నుండి తాము ఫోటోలు సంపాదించామని ఫస్ట్…

సమాజ్ వాదీ ఐ.ఎ.ఎస్ శిక్షణ శిబిరం -కార్టూన్

ఆగండాగండి! ఇది ఐ.ఎ.ఎస్ లను తయారు చేసే శిక్షణా శిబిరం కాదు. తయారయిన ఐ.ఎ.ఎస్ లకు శిక్షణ ఇచ్చే శిబిరం. ఉత్తర ప్రదేశ్ లో ప్రధాని కావాలని ఆశ పడుతున్న ఎం.పి తండ్రి, ముఖ్యమంత్రి అయిపోయిన కుమారులుంగారు కలిసి ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరం. ఇందులో దేనికి శిక్షణ ఇస్తారో ప్రత్యేకంగా చెప్పాలా?

దుర్గ, ఐఎఎస్: నెగ్గేది యాదవ్‌ల పంతమేనా?

అవినీతి రాజకీయ నాయకులకు, ఇసుక మాఫియాకు ఎదురొడ్డి నిలబడిన యువ ఐ.ఎ.ఎస్ అధికారి దుర్గాశక్తి నాగపాల్ అక్రమ సస్పెన్షన్ విషయంలో తండ్రీ కొడుకులయిన యాదవ్ లిద్దరూ తమ మంకు పట్టు కొనసాగిస్తున్నారు. దుర్గాశక్తికి న్యాయం చేయాలంటూ సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్ కు లేఖ రాసిన నేపధ్యంలో ఆమె సస్పెన్షన్ జాతీయ స్ధాయి రాజకీయ సమస్యగా ముందుకు వచ్చింది. దానితో ములాయం సింగ్ యాదవ్ తన పుత్రరత్నం తీసుకున్న చర్య సరైనదే అని ప్రకటిస్తుండగా ప్రతిపక్షాలు,…

ఇసుక మాఫియా కరిగిస్తున్న ఒక ప్రభుత్వ ఆయువు -కార్టూన్

అనగనగా ఒక రాష్ట్ర ప్రభుత్వం. ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక యువకుడు ముఖ్యమంత్రి. నేరాలను, నేరస్ధ మాఫియాలను తుదముట్టిస్తానని ఆయన శపధం చేసి మరీ అధికారంలోకి వచ్చాడు. ప్రజలు పాపం మాఫియాలను తుదముట్టించే రోజుకోసం ఎదురు చూస్తున్నారు. కానీ ప్రజల ఆశలు నెరవేరక పోగా విచిత్ర పరిణామాలు జరుగుతున్నాయి. మాఫియాలను తుదముట్టించే బదులుగా మాఫియాలను తుదముట్టించే నిజాయితీ అధికారులను తుదముట్టించే కార్యక్రమాలు మొదలయ్యాయి. ప్రజలు ఏదయితే ఆశించి గద్దెనెక్కించారో సరిగ్గా దానికి విరుద్ధంగా మన యువనాయకుడు వ్యవరిస్తున్నారు.…

దుర్గ, ఐ.ఎ.ఎస్: ఇసుక మాఫియాకు చెక్ పెట్టినందుకు సస్పెన్షన్

ఈమె పేరు దుర్గ శక్తి నాగపాల్. వయసు కేవలం 28 సంవత్సరాలు. పంజాబ్ కేడర్ ఐ.ఎ.ఎస్ గా ఉత్తర ప్రదేశ్ లో గౌతమ్ బుద్ధ నగర్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ గా నియమితురాలయింది. పదవి చేపట్టింది లగాయితు గ్రేటర్ నొయిడా ప్రాంతంలో యమున, హిందోన్ నదుల వెంట ఇసుకను అక్రమంగా తవ్విపోస్తున్న మాఫియాల గుండెల్లో సింహ స్వప్నంగా నిలిచింది. రాజకీయంగా అత్యున్నత స్ధాయి సంబంధాలు కలిగి ఉన్న ఇసుక మాఫియా తన సర్వశక్తులు ఒడ్డిన ఫలితంగా మతపరమైన…