తమ ఆరు షరతులను ఉపసంహరించుకున్న పోలీసులు, రాంలీలా మైదాన్లో దీక్ష
అన్నా హజారే నిరవధిక నిరాహార దీక్షకు ఢిల్లీ పోలీసులు మంగళవారం 22 షరతులు విధించారు. అందులో 16 షరతులను అంగీకరించిన అన్నా హజారే బృందం మిగిలిన 6 షరతులను తిరస్కరించింది. ఆ షరతులను ఇక్కడ చూడవచ్చు. షరతులను ఆమోదించనందున అన్నా బృందాన్ని అరెస్టు చేసిన పోలీసులు వారిని కోర్టుకు హాజరు పరచడంతో తీహారు జైలులో వారం రోజుల రిమాండ్ కు కోర్టు తరలించింది. అక్కడి నుండి ఢిల్లీ పోలీసులకు, కేంద్ర ప్రభుత్వానికి కష్టాలు మొదలయ్యాయి. తీహార్ జైలుకి…