చైనా అద్భుతం: పాడే ఇసుక తిన్నెల్లో విరిసిన ఎడారి కమలం -ఫోటోలు
అది చైనాలోని గ్జియాంగ్ షావాన్ ఎడారి. చైనా రాజధానికి పశ్చిమంగా 350 కి.మీ దూరంలో ఉండే ఈ ఎడారి ప్రాంతం మంగోలియా సరిహద్దుకు సమీపంలో ఉంటుంది. ఇక్కడ ఉండే ఎత్తైన ఇసుక తిన్నెలకు ప్రకృతి సహజ సిద్ధంగా ఉన్న లక్షణమే దానిని ప్రఖ్యాత టూరిస్టు ఆకర్షణ కేంద్రంగా మార్చివేసింది. ఆ ప్రత్యేక లక్షణం ఏమిటంటే ఇక్కడ ఇసుక తిన్నెలు పాడతాయి. అవును పాడతాయి. ఎలా పాడతాయో, ఎందుకు పాడతాయో ఇంకా తెలియదు గానీ పాడడం మాత్రం నిజం.…