13 ఏళ్ళ బాలుడి హత్య కేసులో రిటైర్డ్ ఆర్మీ అధికారిని అరెస్టు చేసిన సి.బి-సి.ఐ.డి

తమిళనాడులోని మిలట్రీ నివాస సముదాయం వద్ద బాదం కాయకోసం చెట్టెక్కుతున్న 13 సంవత్సరాల బాలుడు దిల్షాన్‌ను తుపాకితో కాల్చి హత్య చేసిన కేసులో సి.బి-సి.ఐ.డి విభాగం ఒక రిటైర్డ్ ఆర్మీ అధికారిని అరెస్టు చేసింది. బాలుడిపై కాల్పులు జరిపింది తానేనని ఆయన అంగీకరించినట్లు సమాచారం. బాలుడు చనిపోయిన రోజున మిలట్రీ నివాస సముదాయం వద్ద సాయుధ సెక్యూరిటీ గార్డులను తాము నియమించలేదని ఆర్మి అధికారులు చెప్పారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, కేసును సీరియస్‌గా తీసుకోవడంతో కేసులో పురోగతి…