సి.ఎం పై మాజీ డి.జి.పి దినేష్ రెడ్డి సంచలన ఆరోపణలు

తన పదవీ కాలాన్ని పొడిగించాలని విజ్ఞప్తి చేసి విఫలమయిన మాజీ డి.జి.పి దినేష్ రెడ్డి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పైన సంచలన రీతిలో ఆరోపణలు చేశారు. పదవీ కాలాన్ని పొడిగించలేదన్న అక్కసుతోనే అబద్ధపు ఆరోపణలకు దిగారని మంత్రులు దినేష్ ఆరోపణలను తిప్పి కొట్టడానికి ప్రయత్నించినప్పటికీ వారి సమాధానాల్లో పెద్దగా విషయం లేదు. దానితో కిరణ్ కుమార్ రెడ్డి పనితీరుపై పలు అనుమానాలు ముసురుకున్నాయి. ఇప్పటిదాకా తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయడానికి దినేష్ కృషి చేశారని తెలంగాణ వాదులు…

తీవ్రమైన ది హిందు, డిజిపిల వివాదం

పాత బస్తీలోని ఒక బాబాను రాష్ట్ర అత్యున్నత పోలీసు అధికారి దినేష్ రెడ్డి సందర్శించడం గురించి రాసిన వార్తపై రేగిన రగడ తీవ్రరూపం దాల్చుతోంది. పాతబస్తీలో నివసించే ముస్లిం మత బాబా హబీబ్ ముస్తఫా ఇద్రాస్ బాబాను డిజిపి దినేష్ రెడ్డి సందర్శించడం గురించి ది హిందు పత్రిక వార్త ప్రచురించగా ఈ వార్తను దురుద్దేశంతో ప్రచురించారని డిజిపి ఆరోపిస్తున్నారు. ఇతర పత్రికలన్నీ ఈ వార్తకు పెద్ద ప్రాముఖ్యత ఇవ్వకుండా లోపలి పేజీల్లో వేయగా ది హిందు…