రుణ సంక్షోభంలో ఫ్రాన్సు కూడా! పతనబాటలో అమెరికా, యూరప్ షేర్లు

అమెరికా క్రెడిట్ రేటింగ్ ప్రభావం నుండి తేరుకుని మంగళవారం అమెరికా, యూరప్ దేశాల స్టాక్ మార్కెట్లు లాభాలు చవి చూశాయి. కాని ఆ ఆనందం బుధవారానికి అవిరైపోయింది. యూరోజోన్‌లో రెండవ శక్తివంతమైన ఆర్ధిక వ్యవస్ధ కలిగి ఉన్న ఫ్రాన్సు కూడా యూరప్ అప్పు సంక్షొభం బారిన పడనుందని అనుమానాలు బలంగా వ్యాపించాయి. దానితో యూరప్, అమెరికా ల షేర్ మార్కెట్లు పెద్ద ఎత్తున అమ్మకాలకు గురైనాయి. రుణ సంక్షోభం దరిమిలా ఫ్రాన్సు క్రెడిట్ రేటింగ్ కూడా తగ్గిపోతుందన్న…