రాధిక, రోహిత్: అచ్చమైన దళిత కధలో పాత్రలు -1

పాలక పార్టీ తాజాగా మరో కేంద్ర మంత్రిని రంగంలోకి దించింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్ధుల ఆందోళనను పరిష్కరించేందుకు కాదు. రోహిత్, మరో నలుగురు దళిత విద్యార్ధులపై మరింత బురద జల్లేందుకు. యూనివర్సిటీ పాలకవర్గం ద్వారా తాము సృష్టించిన సమస్య నుండి దళిత కోణాన్ని తొలగించడానికి స్మృతి ఇరానీ చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో విదేశాంగ మంత్రిని కేంద్రం ప్రవేశపెట్టింది. “నాకు అందుబాటులో ఉన్న సంపూర్ణ సమాచారం మేరకు రోహిత్ అసలు దళితుడే కాదు. ఆయన దళితుడని…

దళిత స్త్రీని కొట్టి, బట్టలిప్పి, ఊరేగించి…..

మహా రాష్ట్ర ముఖ్యమంత్రి పృధ్వీరాజ్ చవాన్ సొంత గ్రామంలోనే ఒక దళిత స్త్రీని బట్టలిప్పి ఊరేగించారు. న్యాయం చెయ్యమని పోలీసు స్టేషన్ కి వెళితే ‘మీ గ్రామంలో ఇవి మామూలే కదా? కేసెందుకు?’ అని పోలీసులు తిప్పి పంపేశారు. ఈ దురన్యాయానికి కారణం మరీ ఘోరంగా ఉంది. ఆమె పాత్ర ఏ మాత్రం లేని ఓ ఘటనకి ఆమెని బాధ్యురాల్ని చేసి ఆమెను శిక్షించారు. బాధితురాలు నలభై రెండేళ్ళ రేఖా చవాన్. ఆమె కొడుకుతో కలిసి అగ్ర…