కుల వేధింపులతో దళిత పూజారి ఆత్మహత్య

కుల వివక్షతో ఆలయ పాలక సిబ్బంది పాల్పడుతున్న వేధింపులకు తట్టుకోలేక తమిళనాడులో 23 సంవత్సరాల దళిత పూజారి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పూజారి పదవినుండి తప్పుకోవాలనీ, అసలు గుడిలోకే రాకూడదనీ పాలక సిబ్బంది వేధించడంతో దళిత పూజారి ఎస్.నాగముత్తు మూడు నెలల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు పెట్టకుండా పట్టించుకోక పోవడంతో ఒక స్వచ్ఛంద సంస్ధ సాయంతో కోర్టుకి కూడా వెళ్ళాడు.  వేధింపులపై కేసు నమోదు చేసి విచారణ చేయాలని కోర్టు ఆదేశాలిచ్చినా వేధింపుల్లో మార్పులేకపోవడంతో…