యుద్ధము – వాణిజ్యం: పాలకవర్గాల దళారీ స్వభావం బట్టబయలు -రెండో భాగం
ఆంగ్లం: విశేఖర్; తెలుగు: రమా సుందరి; 03-06-2025 ప్రధాన మంత్రి మోడి విభిన్న స్పందన పహల్గామ్ దాడికి ప్రతిస్పందనగా సామాన్య కశ్మీరీలు ప్రదర్శించిన హీరోయిజానికి సరిగ్గా భిన్నంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడి స్పందన ఉండింది. సామాన్య ప్రజల మానవతా ప్రతిస్పందనకు ఆయన ఏ మాత్రం సాటి రాలేకపోయాడు. స్థానిక నివాసులు తమ జీవితాలను పణంగా పెట్టి బాధితులను రక్షించటానికీ, సహాయం చేయటానికి ముందుకు రాగా; నరేంద్ర మోడి మాట్లాడిన మాటలు పొరుగు దేశం వైపు తప్పిదాన్ని…
