మరో బాంబు వదిలిన ఆర్మీ చీఫ్, భావి ఆర్మీ చీఫ్ పై సి.బి.ఐ విచారణకి ఆదేశం
గత కొద్ది రోజులుగా ప్రభుత్వంతో తలపడుతున్నట్లు కనిపిస్తున్న ఆర్మీ చీఫ్ జనరల్ వి.కె.సింగ్ సంచల రీతిలో మరో బాంబు వదిలాడు. రానున్న మే నెలలో తాను రిటైరయ్యాక తన స్ధానాన్ని నింపేవారిలో రెండవ స్ధానంలో ఉన్న ఆర్మీ అధికారిపై వచ్చిన అవినీతి ఆరోపణలను విచారించవలసిందిగా సి.బి.ఐ కి లేఖ రాశాడు. ప్రధానికి రాసిన తాను రాసిన లేఖను లీక్ చేసింది తాను కాదని ఆయన సూచించిన కొద్ది గంటలకే సి.బి.ఐ కి రాసిన లేఖ సంగతి బైటికి…
