2జి కుంభకోణంలో రాలిపడిన రెండో తల, కేంద్ర టెక్స్‌టైల్స్ మంత్రి దయానిధి మారన్ రాజీనామా

2జి స్పెక్ట్రం కుంభకోణంలో రెండో తలకాయ రాలిపడింది. బుధవారం సుప్రీం కోర్టుకి సి.బి.ఐ సమర్పించిన స్టేటస్ రిపోర్ట్ లో కేంద్ర టెక్స్‌టైల్స్ శాఖా మంత్రి దయానిధి మారన్ పాత్రపై వివరాలు పొందుపరిచిన సంగతి విదితమే. చెన్నైకి చెందిన శివరామ కృష్టన్, తన ఎయిర్ సెల్ కంపెనీ లోని మెజారిటీ షేర్లను మలేషియాకి చెందిన మేక్సిస్ కంపెనీకి అమ్మేలా ఒత్తిడి చేశాడనీ, తద్వారా మేక్సిస్ కంపెనీ చేత తన కుటుంబానికి చెందిన సన్ టి.వి లో 600 కోట్ల…