త్వరలో మోడి, జిన్^పింగ్, పుతిన్ ల సమావేశం?

బ్రిక్స్ కూటమిలో ప్రధాన రాజ్యాలైన చైనా, రష్యా, ఇండియా దేశాల అధినేతలు త్వరలో సమావేశం కానున్నట్లు సమాచారం. వ్లాదిమిర్ పుతిన్, ఛి జిన్^పింగ్ ల మధ్య ఇటీవల జరిగిన వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా ఇరువురు నేతలు త్రైపాక్షిక సమావేశం జరపాలన్న అంశాన్ని చర్చించినట్లు తెలుస్తోంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ సహాయకుడు యూరీ ఉషకోవ్ ఈ విషయాన్ని వెల్లడించినట్లు రష్యన్ వార్తా సంస్ధ టాస్ (TASS) తెలియజేసింది. పుతిన్, ఛి ల మధ్య జరిగిన వీడియో కాన్ఫరెన్స్ తాలూకు…