ఒలింపిక్ జ్యోతి రాకమునుపే తగలబడుతున్న లండన్ -కార్టూన్

2012 ఒలింపిక్ ఆటల సంరంభానికి ఇంకా సంవత్సరం మిగిలే ఉంది. ఒలింపిక్ ఆటలు నిర్వహిస్తామని పోటీపడి గెలిచిన లండన్ నగరం అప్పుడే తగలబడిపోతోంది. దశాబ్దాల తరబడి అసమానతకీ, అవమానాలకీ గురైన తొట్టెన్ హామ్, ఇంకా అలాంటి ప్రాంతాల యువత ఉగ్ర రూపం దాల్చి అల్లర్లై లండన్ నగరాన్ని తగలబెడుతోంది. “లూటీలూ, దహనాలతో మీరు సాధించిందేమిటి?” అని అడిగిన విలేఖరులకి “వేలమందిమి శాంతియుత ప్రదర్శనలు చేసినా అస్సలు పట్టించుకోని మీరు మా దగ్గరికి వచ్చి మరీ ఇప్పుడెందుకా ప్రశ్నని…