తమ్ముడూ పవనూ, నీ కాల్మొక్త!
ప్రముఖ జర్నలిస్టు జి.ఎస్.రామ్మోహన్ గారి ఫేస్ బుక్ ఖాతా నుండి దీన్ని సంగ్రహించాను. కొత్త ఓట్ల బిచ్చగాడు పవన్ కళ్యాణ్ గారి సర్కస్ ఫీట్లను సంక్షిప్తంగా వివరిస్తోంది. ********* తమ్ముడూ పవనూ, ఏమన్నా జేస్కో, ఎవురితోనన్నా కలువ్, నీ ఇష్టం. కానీ చే బొమ్మ పక్కన మాత్రం మోదీని పెట్టమాకయ్యా! నీకు పుణ్యముంటది. బాంచెన్ నీ కాల్మొక్త! భగత్ సింగ్ పక్కన కూడా వద్దయ్యా! పాటలెన్నైనా పాడుకో! గబ్బర్ సింగ్ పాటలే పాడుతవో, గద్దర్ పాటలే పాడుతవో…