టిడిపి గెలుపుతో బాబు షేర్లు జంపు!

ఆంధ్రప్రదేశ్ లో తెలుగు దేశం పార్టీ 135 సీట్లు గెలవడంతో మిత్ర పక్షాలతో సంబంధం లేకుండానే ప్రభుత్వం ఏర్పాటు చేయగల స్థానంలో నిలబడి ఉంది. దానితో టిడిపి పార్టీ పెద్దలతో సంబంధం ఉన్న కంపెనీల షేర్లు ఉన్న ఫళంగా పైపైకి ఎగబాకుతున్నాయి.

ఉత్తర ఖండ్ వరదలు: తెలుగు దేశం ఖాతాలో క్రెడిట్స్

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కంటే ముందుగానే స్పందించడం ద్వారా రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ తెలుగు దేశం, వరద బాధితుల అభిమానం చూరగొన్నట్లు కనిపిస్తోంది. పుణ్య క్షేత్రాల సందర్శనకు వెళ్ళి తెలియని చోట, తెలియని భాష మధ్య, తెలియని మనుషుల మధ్య పలు ఇక్కట్లు ఎదుర్కొంటున్న బాధితులకు కాసింత పలకరించే దిక్కు కనపడినా కొండంత ధైర్యం, నమ్మకం తెచ్చుకుంటారు. ఆ పని చేయడం ద్వారా తెలుగు దేశం పార్టీ తన పూర్వ వైభవం తెచ్చుకోవడంలో కొంత సఫలం…

తెలంగాణ కోసం అంతిమ సమరం, కాంగ్రెస్, టిడిపి పార్టీల ఎం.ఎల్.ఎల రాజీనామా అస్త్ర ప్రయోగం

తెలంగాణ రాష్ట్రం కోసం అంతిమ సమరం ప్రారంభమైనట్లు కనిపిస్తోంది. తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రజా ప్రతినిధులలో సగం కంటే ఎక్కువమంది సోమవారం రాజీనామా చేశారు. పాలక కాంగ్రెస్ పార్టీకి చెందిన 37 మంది ఎం.ఎల్.ఎ లు, పతిపక్ష తెలుగుదేశం పార్టీకి చెందిన 28 మంది ఎం.ఎల్.ఎ లు తమ రాజీనామా లేఖలను డిప్యుటీ స్పీకర్‌కు అందించినట్లు ప్రకటించారు. అంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా, కేంద్ర హోం మంత్రి చిదంబరం ఎ.పి లొ పరిస్ధితి అదుపులోనే ఉందనీ,…