‘తెలంగాణ’ ఏర్పాటుపై ఇంత ద్వేషం అవసరమా?
ఒక కొత్త రాష్ట్రం ఏర్పాటుపైన ఇంత నటన, రాజకీయం, ఎగతాళి, విద్వేషం అవసరమా? తెలంగాణ ప్రాంతం వాళ్ళు భారత దేశం నుండి విడిపోతామని కోరుతున్నారా? కేంద్ర ప్రభుత్వ అధికారం తమపై వద్దని నిరాకరిస్తున్నారా? తెలంగాణకు స్వయం ప్రతిపత్తి కావాలని అడుగుతున్నారా? పాకిస్ధానీ ఐ.ఎస్.ఐ కి గూఢచారుల్ని సరఫరా చేస్తున్నారా లేక చైనా ఇంటెలిజెన్స్ కు సమాచారం ఇస్తున్నారా? తెలంగాణ రాష్ట్రం అడుగుతున్నారా వాళ్ళు, లేక తెలంగాణ దేశం అడుగుతున్నారా? కేవలం రాష్ట్రం మాత్రమే తెలంగాణ ప్రజలు అడుగుతున్నది.…