టి.డి.పి, వైకాపాలే తెలంగాణకు కారణం -కాంగ్రెస్ మంత్రులు

కాంగ్రెస్ పార్టీకి చెందిన సీమాంధ్ర ప్రాంత మంత్రులు, ఎమ్మేల్యేలు, నాయకులు ఒక విచిత్ర వాదన ముందుకు తెచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం వారి దృష్టిలో తెలంగాణకు కారకులు కాదు. తెలుగుదేశం, వైకాపాలు తెలంగాణకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వానికి లేఖలు ఇవ్వడం వల్లనే కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ ప్రకటించింది తప్ప వారికి ఇవ్వాలని ఏ కోశానా లేదు. టి.డి.పి, వైకాపాల లేఖలకు, రాష్ట్ర విభజనకు నిరసనగా తాము రాజీనామాలు చేయడానికి నిర్ణయించుకున్నామని కాంగ్రెస్ మంత్రులు,…

అది ఆంధ్ర, ఇది తెలంగాణ -కార్టూన్

“శుభ వార్త! హై కమాండ్ నిర్ణయం తీసేసుకుంది. అదేమో ఆంధ్ర, ఇదేమో తెలంగాణ…”  — కాంగ్రెస్ పార్టీ రాజకీయ అవసరం, తెలంగాణ ఏర్పాటును ఎలా తరుముకొచ్చిందో ఈ కార్టూన్ చక్కగా వివరిస్తోంది. తెలంగాణ అనుకూల నిర్ణయం ద్వారా తెలంగాణలో గణనీయ సంఖ్యలో పంచాయితీలను ఇప్పటికే కాంగ్రెస్ గెలుచుకుంది. విచిత్రంగా సీమాంధ్ర ప్రాంతాల్లో సైతం కాంగ్రెస్ గెలుచుకున్న పంచాయితీలు తక్కువేమీ కాదు. చూడబోతే 2014 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ విసిరిన పాచిక పారబోతున్నట్లే ఉంది.

తెలంగాణ: ఆం.ప్ర ఉభయ సభల అభిప్రాయం తప్పనిసరి -నిపుణులు

తెలంగాణ రాష్ట్ర విభజన కోసం ఆంధ్ర ప్రదేశ్ ఉమ్మడి శాసన సభ మరియు విధాన సభలు రెండు తమ తమ అభిప్రాయాలు చెప్పడం తప్పనిసరి అని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ అభిప్రాయాలను తప్పనిసరిగా పాటించవలసిన అవసరం పార్లమెంటుకు లేదని కూడా వారు చెబుతున్నారు. లగడపాటి రాజగోపాల్ లాంటివారు ‘ఇప్పటికైనా మించిపోయింది లేదు. అధిష్టానం మనసు మార్చొచ్చు’ అని వ్యాఖ్యానిస్తున్న నేపధ్యంలో నిపుణుల అభిప్రాయాలను పరిశీలించడం ఉపయుక్తం కాగలదు. లోక్ సభకు సెక్రటరీ జనరల్ గా పని…

తెలంగాణ: కాంగ్రెస్ ఫుడ్ సెక్యూరిటీ? -కార్టూన్

రాజకీయ పార్టీలకు ఏది ఆహారం? ఇంకేది, ఓట్లు, సీట్లు. ఎన్ని ఓట్లు వస్తే అన్ని సీట్లు వస్తాయి. సీట్లు పెరిగేకొందీ అధికారం దగ్గరవుతుంది. వర్షాకాలం సమావేశాల్లో ‘ఆహార భద్రతా బిల్లు’ ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకోడానికి కాంగ్రెస్ తెగ తాపత్రయ పడుతోంది. ‘గ్రామీణ ఉపాధి హామీ పధకం’ 2009 ఎన్నికల్లో ఆ పార్టీకి ఓట్ల వరప్రదాయని అయినట్లుగా 2014 ఎన్నికల్లో ‘ఆహార భద్రతా చట్టం’ ఆ తరహా పాత్ర పోషిస్తుందని కాంగ్రెస్ ఆశ. అందుకే బి.జె.పి, తృణమూల్ కాంగ్రెస్ తదితరులు…

తెలంగాణ ప్రజకు అభినందన వందనం!

యు.పి.ఎ సమన్వయ కమిటీ, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ రెండూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా ఏకగ్రీవ తీర్మానాలను ఆమోదించాయి. ఎల్లుండి (ఆగస్టు 1) సాయంత్రం కేంద్ర కేబినెట్ సమావేశం కాబోతున్నది. అందులో కూడా ఏకగ్రీవ తీర్మానమే ఆమోదం పొందుతుంది. కాబట్టి ఇక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లాంఛనప్రాయమే. గత 56 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం కోసం అనేకానేక రక్త తర్పణలు కావించిన తెలంగాణ ప్రజలకు ఈ సందర్భంగా అభినందన వందనం! సాయంత్రం 4 గంటలకు ప్రారంభం…

మేడం-తెలంగాణ -కార్టూన్

“మేడం గారు నిర్ణయం తీసేసుకున్నారు. సరైన సమయంలో దాన్ని బైటపెడతారు.” – భారత దేశం ప్రజాస్వామ్య దేశం అని పాలకులు చెబుతుంటారు. మామూలు ప్రజాస్వామ్య దేశం కూడా కాదు, ‘ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం’ అని వారు తరచుగా చెప్పే మాట! అంటే ఇక్కడ జరిగే నిర్ణయాలన్నీ ప్రజల అభీష్టం మేరకే జరగాలి. ఎన్నికలు జరిగాక, ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చే రాజకీయ పార్టీ లేదా పార్టీల కూటమి వివిధ నిర్ణయాలు చేస్తుంది కనుక ఏ…

రాయల-తెలంగాణ ప్రతిపాదన కె.సి.ఆర్ దే!?

రాయల తెలంగాణ ఏర్పాటును మొట్టమొదట ప్రతిపాదించింది తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీయారెనా? అవునంటోంది ‘ది హిందు.’ వినడానికి విచిత్రంగా ఉన్నా అదే నిజమట! రాయల తెలంగాణ ప్రతిపాదన తనకే ఎదురు తిరగడంతో దానిని వ్యతిరేకిస్తున్నట్లు ఆయన ఇప్పుడు నటిస్తున్నారని పత్రిక సూచిస్తోంది.  ది హిందు పత్రిక మాటల్లోనే ఆ సంగతి చూడడం సముచితం. Sounds strange but true that the proposal of ‘Rayala-Telangana’ with ten districts of Telangana and two…

తెలంగాణ వ(ఇ)చ్చేసినట్లే!

తెలంగాణ ప్రజల చిరకాల ప్రజాస్వామిక ఆకాంక్ష నెరవేరే రోజు కొద్ది దూరంలోనే ఉందన్న సంగతి దాదాపు ఖాయం అయిపోయింది. ఈ మేరకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నిర్ణయం తీసేసుకున్నట్లు అభిజ్ఞ వర్గాలను ఉటంకిస్తూ ది హిందూ పత్రిక తెలియజేసింది. సదరు పత్రిక ప్రకారం ‘ఆహార భద్రతా బిల్లు’ కోసమే ప్రస్తుతం నిర్ణయం ప్రకటన వాయిదా పడింది. తెలంగాణ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటన చేసిన వెంటనే సీమాంధ్ర కాంగ్రెస్ ఎం.పిలు రాజీనామా చేసే అవకాశం ఉందని, అలా…

తెలంగాణ ఖాయమేనట!

శుక్రవారం ది హిందూ పత్రిక ఓ ఎక్స్ ప్లోజీవ్ కధనం ప్రచురించింది. ఈ కధనం ప్రకారం తెలంగాణ రాష్ట్రం రావడం దాదాపు ఖాయమైపోయింది. ఇక మిగిలింది సి.డబ్ల్యూ.సి నిర్ణయమే. బహుశా కోర్ కమిటీలో నిర్ణయం జరిగిపోయి దానిని ఫార్మలైజ్ చేయడానికి సి.డబ్ల్యూ.సి కి పంపి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వంలోని అభిజ్ఞ వర్గాలను ఉటంకిస్తూ పత్రిక ఈ కధనం ప్రచురించింది. హైద్రాబాద్ పరిస్ధితి ఏమిటన్నదే ఇప్పుడు చర్చల్లో ఉన్న అంశం తప్ప తెలంగాణా ఇవ్వాలా, వద్దా అన్నది…

తెలంగాణ అంటే జనం కాదా? -కార్టూన్

కాదన్నట్టే ఉంది కాంగ్రెస్ వ్యవహారం చూస్తుంటే. తెలంగాణ ఉద్యమం అంటే ప్రజలు, వారి ఆకాంక్షలు, వారి అవసరాలు కాదు. తెలంగాణ ఉద్యమం అంటే కాంగ్రెస్ దృష్టిలో 2014 ఎన్నికల్లో కురిసే ఓట్లు, సీట్లు మాత్రమే. ఆ మాటకొస్తే ఏ పార్టీకి మాత్రం కాదు? తెలంగాణ వాగ్దానం చేసిన బి.జె.పి కూడా 1999 సాధారణ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చాక తెలుగు దేశం సీట్ల కోసం దాన్ని పక్కన పెట్టింది. అవే సీట్ల కోసం రేపు తెలంగాణ ఇవ్వడానికి సోనియా…

ఒక ఊరేగింపుకి ఇంత నిర్బంధమా?

పశ్చిమ దేశాల ప్రజాస్వామిక ముసుగులు ఒక్కొక్కటీ తొలగిపోతున్న నేపధ్యంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కూడా తానూ తగ్గేది లేదని చాటుకుంటోంది. ఒకే ఒక ఊరేగింపుకు, అది కూడా రాజ్యాంగం గ్యారంటీ చేసిన భావ ప్రకటనా స్వేచ్ఛకు అనుగుణంగా మాత్రమే తలపెట్టిన ఊరేగింపుకు, ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం కనీ వినీ ఎరుగని రీతిలో పది రాష్ట్రాలను జిల్లాలను పోలీసు కాపలా మధ్య దిగ్బంధించిన తీరు అత్యంత హేయం. బస్సులు, రైళ్లు, మెట్రో రైళ్లు అన్నీ రద్దు చేసి, స్కూళ్ళు,…

తెలంగాణ ఈ నెల్లోనే -కె.సి.ఆర్

తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు కె.చంద్రశేఖర్ రావు మరోసారి ప్రజలని మభ్యపెట్టే పనిలో పడినట్లు కనిపిస్తోంది. తెలంగాణ సమస్య ఈ నెలలోనే పరిష్కారం కానున్నదని ఆయన ప్రకటించాడు. ఢిల్లీకి ప్రయాణం కాబోతూ ఆయన పత్రికలు, చానెళ్ల ముందు ఈ అనూహ్య ప్రకటన చేశాడు. ఢిల్లీలో తెలంగాణ కోసం మూడు రోజులు దీక్ష చేసి జాతీయ పత్రికల దృష్టిని ఆకర్షించడంలో బి.జె.పి సఫలం అయిన నేపధ్యంలో కేంద్రీకరణను తనవైపు మళ్లించుకోవడానికే కె.సి.ఆర్ ఈ ప్రకటన చేశాడన్నది కొందరి అనుమానం.…

శ్రీకృష్ణ కమిటీ విశ్వసనీయత

శ్రీకృష్ణ కమిటీ విశ్వసనీయత ‘ఛాప్టర్ 8′ తోనే మట్టిగొట్టుకు పోయింది. ఏ కమిషన్ అయినా, స్వతంత్ర భారత దేశంలో ఈ విధంగా ఒక ప్రజా ఉద్యమాన్ని ఎలా అణచివేయాలో సూచించిన సందర్భాలు లేవు. భారత దేశమే కాదు. ఆధునిక ప్రజాస్వామ్య దేశాలలో దేనిలోనైనా ప్రజా ఉద్యమాలను అణచివేయడానికి సూచనలిచ్చిన కమిషన్ ఉందా అన్నది నాకు అనుమానమే. ప్రభుత్వాలు గూడచారులను నియమించుకుని ప్రజా ఉద్యమాలను అణిచివేసేందుకు తగిన సమాచారం తెప్పించుకుంటాయి అది వేరే సంగతి. కాని ప్రధాని భాషలోనే…

‘భాషాప్రయుక్త రాష్ట్రాల’ సిద్ధాంతానికి తెలంగాణ ఏర్పాటు వ్యతిరేకం కాదు

“ఒక రాష్ట్రంలో ఒకే భాష మాట్లాడే వారు” ఉండడమే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకి మూల సిద్ధాంతం. “ఒక రాష్ట్రంలో ఒకే భాష మాట్లాడేవారు” ఉండడం అన్న ప్రాతిపదికన మాత్రమే హిందీ భాషకు అన్ని రాష్ట్రాలు ఉండడాన్ని అర్ధం చేసుకోగలం. “ఒక రాష్ట్రంలో ఒకే భాష మాట్లాడేవారు” ఉండడం అంటే ఒక రాష్ట్రంలో రెండు భాషలు మాట్లాడెవారు ఉండకూడదన్నదే అర్ధం తప్ప ఒకే భాష మాట్లాడేవారు ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలలో ఉండకూడదని అర్ధం కాదు. హిందీ…

తెలంగాణ డిమాండ్ ను ఎందుకు సమర్ధించాలి?

బ్రిటిష్ వాడికి కోస్తా జిల్లాలనుండి రెవిన్యూ వసూళ్ళు రావడానికి రెండు డ్యాంలు కట్టించాడు. విజయవాడ, ధవళేశ్వరం. కొన్ని కాలవలు తవ్వించాడు. కేవలం వాడి ప్రయోజనాల కోసమే. వాటి ద్వారా కృష్టా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో భూస్వాములు వ్యవసాయం చేసి అభివృద్ధి చెందారు. బ్రిటిష్ వాడు వెళ్ళిపోయేనాటికి వారి వద్ద పెట్టుబడి సమకూరింది. పెట్టుబడి సమకూరాక అది ఊరికే కూర్చోదు. లాభాల కోసం పరుగులు పెడుతుంది. లాభాలకోసం కృ, గుం, ఉ.గో జిల్లాల భూస్వాములు హైద్రాబాద్ వచ్చి…