మృతవీరుడి మరణం పట్ల శంకరుడిని నిలదీస్తూ, నిరసిస్తూ హృదయాన్ని పిండేసే పాట -వీడియో

మిత్రులు కొణతం దిలీప్ గారి బ్లాగ్ నుండి సంగ్రహించిన వీడియో ఇది. తెలంగాణ రాష్ట్రం కోసం యువకులు తమను తాము దహించుకుంటున్న రోజుల్లో 28 ఏప్రిల్, 2010 తేదీన అటువంటి ఒక యువకుడి ఆత్మాహుతి పట్ల నిరసన తెలుపుతూ జరిగిన సభలో శంకరుడినే ప్రశ్నిస్తున్న కళాకారుడి హృదయం ఈ పాట. కొన్ని వందల తల్లుల కడుపు శోకానికి అక్షర రూపం ఈ పాట. అంతమంది తల్లుల గర్భశోక ధ్వని రూపం కూడా ఈ పాట. పాషాణ హృదయులనైనా…

తెలంగాణ డిమాండ్‌పై అంతర్జాతీయ పెట్టుబడుల దృక్పధం ఎలా ఉంది?

తెలంగాణ రాష్ట్రం డిమాండ్ చేస్తూ ఆ ప్రాంతంలో ఉద్యమాలు సాగుతున్నందున రాష్ట్రానికి రావలసిన పెట్టుబడులు వెనక్కి పోతున్నాయని గత సంవత్సరం నుండి ఆరోపణలు వస్తున్నాయి. నిరంతరం ఎదో ఒక ఆందోళన జరుగుతున్నందున రవాణా సౌకర్యం దెబ్బతిని కంపెనీల కార్యకలాపాలు దెబ్బతింటున్నాయని వార్తా సంస్ధలు కూడా రాస్తున్నాయి. వివిధ అంతర్జాతీయ సంస్ధల సిబ్బంది తమ తమ కార్యాలయాలకు చేరుకోవడంలో విఫలమవుతున్నందున నష్టం జరుగుతున్నదని అవి తెలుపుతున్నాయి. ముఖ్యంగా హైద్రాబాద్ బ్రాండ్ నేమ్ అంతర్జాతీయంగా మారుమోగుతున్న సందర్భంలో తెలంగాణ కోసం…

రాజీనామాలు చేసింది రాజ్యాంగ సంక్షోభం సృష్టించడానికి కాదు -కాంగ్రెస్ మంత్రులు

తాము రాజీనామా చేసింది రాజకీయ లేదా రాజ్యాంగ సంక్షోభం సృష్టించడానికో, కాంగ్రెస్ హైకమాండ్‌ను ధిక్కరించడానికో కాదనీ తెలంగాణ ప్రజల్లో ప్రత్యేక రాష్ట్రం పట్ల ఉన్న బలీయమైన ఆకాంక్షను కాంగ్రెస్ హైకమాండ్ కి తెలియజేయడానికేనని సీనియర్ మంత్రి జానారెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ చెప్పారు. అనివార్య పరిస్ధితుల రీత్యానే తెలంగాణ ఎం.ఎల్.ఎ లు తమ పదవులకు రాజీనామా చేస్తున్నారని, తమ రాజీనామాలద్వారా తెలంగణ రాష్ట్ర సంక్షోభానికి పరిష్కారం కనుగునడానికి వారు ప్రయత్నిస్తున్నారని ఆయన తెలిపాడు. డిసెంబరు 9, 2009 తేదీన…