14(F) రద్దుకు బందు సరే; కె.సి.ఆర్-కాంగ్రెస్ నాటకాల బందు ఎన్నడు?
పోలీసు ఉద్యోగాల నియామకాల కోసం హైద్రాబాదును ఫ్రీ జోన్ గా పరిగణిస్తూ రాష్ట్రపతి జారీ చేసిన 14(F) ఉత్తర్వులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్ధి సంఘాల ఐక్యకార్యాచరణ సమితి ఇచ్చిన పిలుపుమేరకు తెలంగాణ బందు విజయవంతమైనట్లుగా వార్తలు తెలుపుతున్నాయి. తెలంగాణ విద్యార్ధుల జాయింట్ యాక్షన్ కమిటీ, ఇతర తెలంగాణ ప్రజా సంఘాల మద్దతుతో తెలంగాణ బందును విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు వార్తా ఛానెళ్ళు ప్రకటించాయి. 1975 రాష్ట్రపతి ఉత్తర్వులనుండి 14(F) క్లాజును తొలగించాలని తెలంగాణ విద్యార్ధులు, తెలంగాణ…