తెలంగాణ ఉద్యమం తెలంగాణ ప్రజలది, ఉద్యమాన్ని చూపి రౌడీ చర్యలకు దిగడం కట్టిపెట్టాలి
ఢిల్లీలోని ఆంధ్ర ప్రదేశ్ భవన్‌లొ కె.సి.ఆర్ అల్లుడు హరీష్ రావు వేసిన వీరంగం ఖండనార్హం. ఏపి భవన్‌లో ఛానెళ్ళ కెమెరాల సాక్షిగా ఆయన చేసిన అరాచకం ఏ విధంగానూ సమర్ధనీయం కాదు. ఫర్నిచర్‌ని కాళ్ళతో తన్నుకుంటూ, పెద్ద పెద్దగా కేకలు వేస్తూ, తలుపుల్ని బాదుతూ అంతిమంగా అక్కడ అందుబాటులో ఉన్న అధికారిని రెండు చెంపలపైన కొట్టడం ఒక రాజకీయనాయకుడు, అందునా వెనకబడిన ప్రాంతం హక్కుల కోసం ఉద్యమిస్తున్నామని చెబుతున్న పార్టీకి చెందిన నాయకుడు, చేయకూడని పని. చట్ట…