ఎవడు లాగితే లగడపాటి కిందపడతాడో…
“… వాడే నిజమైన తెలంగాణ వాది” అని అంటోంది డెక్కన్ టి.వి. జనవరి 22 తేదీ హైద్రాబాద్ లో జరిగిన సీమాంధ్ర ధర్నాలో లగడపాటి రాజగోపాల్ కు అవమానం జరిగింది. వేదికపై ప్రసంగిస్తున్న లగడపాటిని తెలంగాణకు చెందిన యువకుడు ఒకరు కిందకు లాగేయడంతో ఆయన కింద పడిపోయారు. ఈ సంఘటన పట్ల తెలంగాణ వాదులు సంతోషంతో హర్షం ప్రకటిస్తుంటే సీమాంధ్ర లేదా సమైక్య ఉద్యమకారులు విమర్శలు కురిపిస్తున్నారు. మొదట ఛలో అసెంబ్లీ అని ప్రకటించిన ఏ.పి.ఎన్.జి.ఓ సంస్ధ…


