ఒక ఊరేగింపుకి ఇంత నిర్బంధమా?

పశ్చిమ దేశాల ప్రజాస్వామిక ముసుగులు ఒక్కొక్కటీ తొలగిపోతున్న నేపధ్యంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కూడా తానూ తగ్గేది లేదని చాటుకుంటోంది. ఒకే ఒక ఊరేగింపుకు, అది కూడా రాజ్యాంగం గ్యారంటీ చేసిన భావ ప్రకటనా స్వేచ్ఛకు అనుగుణంగా మాత్రమే తలపెట్టిన ఊరేగింపుకు, ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం కనీ వినీ ఎరుగని రీతిలో పది రాష్ట్రాలను జిల్లాలను పోలీసు కాపలా మధ్య దిగ్బంధించిన తీరు అత్యంత హేయం. బస్సులు, రైళ్లు, మెట్రో రైళ్లు అన్నీ రద్దు చేసి, స్కూళ్ళు,…

తెలంగాణ ఈ నెల్లోనే -కె.సి.ఆర్

తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు కె.చంద్రశేఖర్ రావు మరోసారి ప్రజలని మభ్యపెట్టే పనిలో పడినట్లు కనిపిస్తోంది. తెలంగాణ సమస్య ఈ నెలలోనే పరిష్కారం కానున్నదని ఆయన ప్రకటించాడు. ఢిల్లీకి ప్రయాణం కాబోతూ ఆయన పత్రికలు, చానెళ్ల ముందు ఈ అనూహ్య ప్రకటన చేశాడు. ఢిల్లీలో తెలంగాణ కోసం మూడు రోజులు దీక్ష చేసి జాతీయ పత్రికల దృష్టిని ఆకర్షించడంలో బి.జె.పి సఫలం అయిన నేపధ్యంలో కేంద్రీకరణను తనవైపు మళ్లించుకోవడానికే కె.సి.ఆర్ ఈ ప్రకటన చేశాడన్నది కొందరి అనుమానం.…

తెలంగాణ అంశాన్ని కేంద్ర త్వరలోనే తేల్చేస్తుంది -సి.ఎం కిరణ్ కుమార్

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సమస్యను కేంద్ర ప్రభుత్వం త్వరలోనే పరిష్కరిస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శనివారం ఢిల్లీలో విలేఖరులకు తెలిపాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో కేంద్ర తెలంగాణ సమస్యను పరిష్కరిస్తుందని ఆయన పేర్కొన్నాడు. కాంగ్రెస్ అధిష్టానం పిలుపుతో ఢిల్లీ వచ్చిన సి.ఎం కిరణ కుమార్ రెడ్డి, డెప్యుటి సి.ఎం దామాదర రాజ నరసింహరాజు లు సీనియర్ మంత్రులు ప్రణబ్ ముఖర్జీ, ఎ.కె.ఆంటోని, పి.చిదంబరం, గులాం నబీ ఆజాద్ లతో…